‘‘చంద్రబాబు పాకులాడారు.. జగన్ రాజీ పడలేదు..’’
‘పార్లమెంటులో వైసీపీ కొన్ని బిల్లులకు మద్దతు ఇచ్చింది కదా... అలాంటప్పుడు ఆ పార్టీతో ఎందుకు పొత్తు పెట్టుకోలేదు. చంద్రబాబుతో ఎందుకు పెట్టుకున్నారు’
బీజేపీతో పొత్తు కోసం టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు పాకులాడారని, బీజేపీ నేతల ముందు సాష్టాంగపడ్డారని కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాటలను బట్టి అర్థమవుతోంది. అదే సమయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన విధానాలను, సిద్ధాంతాన్ని పక్కన పెట్టి బీజేపీకి మద్దతు తెలియజేయలేదని కూడా స్పష్టమవుతోంది. బుద్ధి రావడం వల్లనే చంద్రబాబు తిరిగి తమ వద్దకు వచ్చాడని ఆయన అన్నారు. ఇండియా టుడే కాంక్లేవ్‌లో శుక్రవారం ఆయన మాట్లాడారు.
‘ప్రధాని మోడీని చంద్రబాబు గతంలో టెర్రిరిస్ట్ అన్నారు.. అలాంటి వ్యక్తితో మీరెలా పొత్తు పెట్టుకున్నారు’ అని యాంకర్ అడిగితే... ‘ప్రధాని మోడీని చంద్రబాబు టెర్రిస్టు అని ఎన్డీయే నుంచి వెళ్లిపోయారు. మేం ఆయనను వెళ్లాలని అనలేదు. ఆయనే వెళ్లిపోయారు. ఎన్నికల్లో ఓడిపోయారు. ఆ తర్వాత చంద్రబాబుకు బుద్ధి వచ్చింది. మళ్లీ మా వద్దకు వచ్చారు. తిరిగి ఎన్డీయేలో చేరుతానని చెప్పారు. దాంతో ఆయనను చేర్చుకున్నాం’ అని అమిత్ షా సమాధానమిచ్చారు.
ఎన్డీయేలో చేరాలని బీజేపీ తనను ఆహ్వానించిందంటూ టీడీపీ నాయకులు చెప్పిన మాటలు, బీజేపీకి చంద్రబాబు షరతులు పెట్టారని ఎల్లో మీడియా చేసిన ప్రచారం అంతా ఉత్తదేనని స్పష్టమైంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను ఎదుర్కోలేకనే బీజేపీ నేతల వద్ద సాష్టాంగపడ్డారని అర్థమవుతోంది.
‘పార్లమెంటులో వైసీపీ కొన్ని బిల్లులకు మద్దతు ఇచ్చింది కదా... అలాంటప్పుడు ఆ పార్టీతో ఎందుకు పొత్తు పెట్టుకోలేదు. చంద్రబాబుతో ఎందుకు పెట్టుకున్నారు’ అని యాంకర్ అడిగిన ప్రశ్నకు.. ‘బీజేపీ ప్రభుత్వం ప్రతిపాదించిన అన్ని బిల్లులకు వైసీపీ మద్దతు ఇవ్వలేదు. కొన్నింటికి మాత్రమే మద్దతు ఇచ్చింది. అది కూడా ఆ పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా ఉండడం వల్లనే తప్ప బీజేపీ కోసం కాదు. పార్లమెంటులో పార్టీపరంగా నిర్ణయాలు ఉండవు. ఆయా పార్టీలకు సొంత ఎజెండాలు, సిద్ధాంతాలు ఉంటాయి. వాటిని తగినట్లుగానే అంశాన్ని బట్టి నడుచుకుంటాయి’ అని ఆయన జవాబిచ్చారు.
దీన్నిబట్టి బీజేపీకి జగన్ బేషరతుగా మద్దతు ఇవ్వలేదని అర్థమవుతోంది. తన పార్టీ విధానాలకు అనుగుణంగా అంశాలవారీగా మాత్రమే మద్దతు ఇచ్చారని తేలిపోయింది. అవకాశవాద రాజకీయాలకు ఆయన పాల్పడలేదని కూడా అర్థం చేసుకోవచ్చు.