ముద్రబోయిన వెంకటేశ్వరరావుకు చంద్రబాబు వెన్నుపోటు

టీడీపీ తనకు అన్యాయం చేసిందని, పదేళ్ల పాటు ఎంతో కష్టపడి పార్టీకి సేవ చేశానని చెప్పారు. టీడీపీకి పుట్టగతులు ఉండవని ఆయన శాపం పెట్టారు.

Advertisement
Update:2024-02-20 20:22 IST

నూజివీడు తెలుగుదేశం నాయకుడు ముద్రబోయిన వెంకటేశ్వరరావును నారా చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడిచారు. ముద్రబోయినను చంద్రబాబు తన నూజివీడు పర్యటనలో ఎమ్యెల్యే అభ్యర్థిగా ప్రకటించారు. ఆడిన‌ మాట‌ను త‌ప్పి గోడ దూకిన పార్థసారధిని నూజివీడు టీడీపీ ఇన్‌చార్జ్‌గా నియమించారు. కనీసం ముద్రబోయిన వెంకటేశ్వరరావుకు ముందుగా చెప్పాలనే సంస్కారాన్ని కూడా చంద్రబాబు పాటించలేదు. దీంతో ముద్రబోయిన వెంకటేశ్వరరావు చంద్రబాబుపై అగ్గి మీద గుగ్గిలం అయ్యారు. అంతేకాదు టీడీపీకి రాజీనామా కూడా చేశారు.

టీడీపీ తనకు అన్యాయం చేసిందని, పదేళ్ల పాటు ఎంతో కష్టపడి పార్టీకి సేవ చేశానని చెప్పారు. టీడీపీకి పుట్టగతులు ఉండవని ఆయన శాపం పెట్టారు. ఎవరైతే తనను పార్టీ నుంచి బయటకు పంపారో వారి అంతు, పార్టీ అంతు చూడకుండా ఉండబోనని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలో భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించనున్నట్లు తెలిపారు. తాను సీఎం జగన్మోహన్‌ రెడ్డిని కలిసిన మాట వాస్తవమేనని చెప్పారు. పూర్తి వివరాలు త్వరలో తెలియజేస్తానని వివ‌రించారు.

ముద్రబోయిన వెంకటేశ్వరరావు జగన్‌ నాయకత్వంలోని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరే అవకాశాలున్నాయి. వైఎస్‌ జగన్‌ టికెట్‌ నిరాకరించడంతో పార్థసారధి వైసీపీకి రాజీనామా చేశారు. అధికారికంగా ఇప్పటి వరకు టీడీపీలో చేరలేదు. అయినప్పటికీ ఆయనను చంద్రబాబు నూజివీడు ఇన్‌చార్జిగా ప్రకటించారు. టీడీపీ తరఫున నూజివీడు నుంచి పోటీ చేసేది తానేనని ఇంతకు ముందు పార్థసారధి చెప్పారు.

Tags:    
Advertisement

Similar News