అన్ స్టాపబుల్ తో బాలయ్య బిజీ.. టీడీపీ పెద్దల వ్యూహం ఫలించినట్టేనా..?

సినిమాలు, ఆహా షో లతో బిజీ అయిపోయారు. చంద్రబాబు లేకపోవడంతో టీడీపీ వ్యవహారాల్లో తలమునకలవుతారని అనుకున్న బాలయ్య అనుకోకుండా సైడైపోయారు.

Advertisement
Update:2023-10-08 13:50 IST

చంద్రబాబు అరెస్ట్ తర్వాత బాలకృష్ణ కాస్త అగ్రెసివ్ గా కనిపించారు. బావ లేని లోటు నేను తీరుస్తానంటూ డైలాగులు కొట్టారు. చంద్రబాబు అరెస్ట్ వార్త విని చనిపోయినవారి కుటుంబాలకు తాను అండగా ఉంటానన్నారు, ఓదార్పు యాత్ర చేస్తానన్నారు. సీన్ కట్ చేస్తే.. ఇప్పుడాయన సినిమాలు, ఆహా షో లతో బిజీ అయిపోయారు. చంద్రబాబు లేకపోవడంతో టీడీపీ వ్యవహారాల్లో తలమునకలవుతారని అనుకున్న బాలయ్య అనుకోకుండా సైడైపోయారు. కాదు కాదు ఓ వ్యూహం ప్రకారమే ఆయన్ను సైడ్ చేశారు.

చంద్రబాబు జైలులో ఉన్నారు, లోకేష్ ని కూడా అరెస్ట్ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ దశలో పార్టీ బాధ్యతల్ని బాలయ్య భుజానికెత్తుకోవడం కొంతమంది టీడీపీ పెద్దలకు ఇష్టంలేదు. పార్టీ మళ్లీ నారావారి చేతుల్లోనుంచి నందమూరి చేతుల్లోకి వెళ్లడం వారికి కష్టంగా మారింది. వారంతా నారా భజనపరులు, చంద్రబాబు అడుగులకు మడుగులొత్తేవారు. ఈ ప్రమాదాన్ని ముందే పసిగట్టి.. బాలకృష్ణను తెలివిగా తప్పించారు, తెరపైకి భువనేశ్వరి, బ్రాహ్మణిని తెచ్చారు. ఆ తర్వాత బాలయ్య కూడా ఎవరో చెప్పినట్టుగానే తన ఉధృతి తగ్గించారు, షూటింగ్ లతో బిజీ అయ్యారు.

అన్ స్టాపబుల్ లిమిటెడ్ ఎడిషన్..

ఏపీలో పొలిటికల్ సీన్ పీక్ స్టేజ్ కి చేరుకుంది. రేపో మాపో ఎన్నికలు అనేంతగా వ్యవహారం ముదిరిపోయింది. చంద్రబాబు సీన్ లో లేకపోవడంతో టీడీపీకి దిక్కులేకుండా పోయింది. ఈ దశలో బాలయ్య హైదరాబాద్ లో తెలంగాణ టీడీపీ వ్యవహారాలు చూడటం విచిత్రంగా తోస్తుంది. అంతే కాదు.. అన్ స్టాపబుల్ లిమిటెడ్ ఎడిషన్ కోసం ఆయన రెడీ అవుతున్నారు. ఈ లిమిటెడ్ ఎడిషన్ చిరంజీవితో మొదలవుతుందనే పుకార్లు వినపడుతున్నాయి. జనసేన-టీడీపీ దోస్తీ నేపథ్యంలో చిరంజీవితో బాలయ్య ఇంటర్వ్యూ ఎలా ఉంటుందనే ఆసక్తి అందరిలోనూ ఉంది.


మీ బావలేడు, ఆయన సీట్లో కూర్చోవయ్యా అంటూ అంబటి రాంబాబు వంటి నేతలు అసెంబ్లీలో కాస్త వెటకారంగా చెప్పినా.. నిజంగా అది ఆయనకు మంచి సలహానే. కానీ బాలయ్యను బలవంతంగా పార్టీకి దూరం చేస్తున్నారు, దాదాపుగా చేసేశారు కూడా. ఈ విషయంలో చంద్రబాబు టీమ్ ఓ ప్లాన్ ప్రకారం అంతా సెట్ చేసింది. బాలయ్యను వెనక్కు నెట్టి ఆడవాళ్లిద్దర్నీ తెరపైకి తెచ్చింది. 

Tags:    
Advertisement

Similar News