టెలి మెడిసిన్ సేవల్లో దేశంలోనే ఏపీ నెంబర్-1

ఏపీ నెంబర్-1 స్థానంలో ఉండటం ఓ విశేషం అయితే దేశవ్యాప్తంగా టెలి మెడిసిన్ కన్సల్టేషన్లలో నాలుగో వంతు ఏపీ నుంచి నమోదు కావడం మరో విశేషం. 2019 నుంచి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 18.3 కోట్ల టెలికన్సల్టేషన్లు నమోదు కాగా, వీటిలో 25 శాతం ఏపీ నుంచే ఉన్నాయి.

Advertisement
Update:2023-12-03 07:11 IST

వైద్యుడు నేరుగా రోగికి అందుబాటులోకి రాలేని సందర్భాల్లో.. ఫోన్, లేదా వీడియో మాధ్యమం ద్వారా వారితో మాట్లాడి అవసరమైన వైద్యసహాయం చేయడమే టెలి మెడిసిన్. ఈ ప్రక్రియ చాన్నాళ్ల క్రితమే ప్రారంభమైనా.. పెద్దగా ప్రాచుర్యంలోకి రాలేదు. ఆరోగ్యం విషయంలో ఎవరూ రిస్క్ తీసుకోరు కాబట్టి, నేరుగా ఆస్పత్రులకే వెళ్తుంటారు. అయితే ఇప్పుడిప్పుడే ఈ టెలిమెడిసిన్ కి కూడా ప్రాధాన్యం పెరుగుతోంది. ముఖ్యంగా ఏపీలో టెలిమెడిసిన్ సేవలు గణనీయంగా పెరిగాయి. దేశంలోనే టెలి మెడిసిన్ సేవల్లో ఏపీ నెంబర్-1 స్థానంలో ఉంది.

రికార్డ్ బ్రేక్..

ఏపీ నెంబర్-1 స్థానంలో ఉండటం ఓ విశేషం అయితే దేశవ్యాప్తంగా జరిగిన టెలి మెడిసిన్ కన్సల్టేషన్లలో నాలుగో వంతు ఏపీ నుంచి నమోదు కావడం మరో విశేషం. 2019 నుంచి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 18.3 కోట్ల టెలికన్సల్టేషన్లు నమోదు కాగా, వీటిలో 25 శాతం ఏపీ నుంచే ఉన్నాయి. ఏపీలో మొత్తంగా 4,61,01,963 కన్సల్టేషన్లు నమోదయ్యాయి. 2.60 కోట్ల కన్సల్టేషన్లతో పశ్చిమ బెంగాల్‌ రెండో స్థానంలో ఉంది. మన రాష్ట్రం నుంచి సగటున రోజుకు 70 వేల కన్సల్టేషన్లు నమోదవుతున్నాయి.

టెలి కన్సల్టేషన్ ఎలా..?

ఏపీలో నేరుగా రోగి, వైద్యుడికి ఫోన్ చేసి కన్సల్టేషన్ తీసుకోవడం కుదరదు. ముందుగా రోగి తనకు సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పట్టణ ఆరోగ్య కేంద్రం, విలేజ్ క్లినిక్ లకు వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ రోగులను వైద్యులు పరీక్షిస్తారు. వారికి ప్రత్యేక వైద్య సేవలు అవసరం అనుకున్న సందర్భాల్లో టెలి మెడిసిన్‌ ద్వారా స్పెషలిస్ట్ వైద్యులను సంప్రదిస్తారు. స్పెషలిస్ట్ వైద్యులు ఆడియో, వీడియో కాల్‌ రూపంలో రోగులతో మాట్లాడి వారికి సలహాలు, సూచనలు ఇస్తారు, మందులు సూచిస్తారు. ఆ మందులను పి.హెచ్.సి., విలేజ్‌ క్లినిక్‌ లోని వైద్య సిబ్బంది రోగులకు అందజేస్తున్నారు. ఏపీలో టెలిమెడిసిన్‌ సేవలు అందించడానికి 26 జిల్లాల్లోని మెడికల్ కాలేజీలు, జిల్లా ఆస్పత్రుల్లో 27 టెలి మెడిసిన్ హబ్‌ లను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రతి హబ్‌ లో ఇద్దరు జనరల్‌ మెడిసిన్, గైనకాలజీ, పీడియాట్రిక్స్‌ స్పెషలిస్ట్‌ వైద్యు­లతో పాటు, ఇద్దరు మెడికల్‌ ఆఫీసర్లు సేవలందిస్తున్నారు.


Tags:    
Advertisement

Similar News