వర్సిటీల్లో ప్రొఫెసర్లకు ఏపీ సర్కార్ గుడ్న్యూస్
రాష్ట్ర యూనివర్సిటీల్లో పనిచేస్తూ యూజీసీ స్కేల్ పొందుతున్న ప్రొఫెసర్లకు మాత్రమే ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని ప్రభుత్వం పేర్కొంది.
Advertisement
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో విధులు నిర్వర్తిస్తున్న ప్రొఫెసర్లకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వారి ఉద్యోగ విరమణ వయసును 62 నుంచి 65 సంవత్సరాలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈమేరకు ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి జె.శ్యామలరావు శనివారం ఉత్తర్వులు విడుదల చేశారు.
ఏపీ ఉన్నత విద్యాశాఖ పరిధిలోని విశ్వవిద్యాలయాల అధ్యాపకులకు ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. రాష్ట్ర యూనివర్సిటీల్లో పనిచేస్తూ యూజీసీ స్కేల్ పొందుతున్న ప్రొఫెసర్లకు మాత్రమే ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని ప్రభుత్వం పేర్కొంది. ఈమేరకు ఆయా విశ్వవిద్యాలయాల రిజిస్ట్రార్ లకు ఆదేశాలు జారీ చేసింది.
Advertisement