భోళా శంకర్‌కు భారీ షాకిచ్చిన ఏపీ సర్కార్

మామూలుగా అయితే అగ్ర హీరోలు నటించిన సినిమాలు విడుదల అవుతున్న సమయంలో టికెట్ ధరలు పెంచుకునే విషయమై ప్రభుత్వాన్ని అనుమతి కోరగానే వెంటనే లభిస్తోంది.

Advertisement
Update:2023-08-09 20:23 IST

మెగాస్టార్ చిరంజీవి ఫ్లోలో నోరు జారారో లేక ఉద్దేశపూర్వకంగా ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారో తెలియదు కానీ, ఆయన నటిస్తున్న లేటెస్ట్ మూవీ భోళా శంకర్‌పై ఆ వ్యాఖ్యల ఎఫెక్ట్ పడుతోంది. ఏపీలో సినిమా బడ్జెట్ ను బట్టి మూవీ విడుదల సమయంలో టికెట్ రేట్లు పెంచుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. కొన్నేళ్లుగా సినిమా విడుదల సమయంలో నిర్మాతలు ప్రభుత్వం అనుమతి పొంది టికెట్ రేట్లు పెంచుకుంటున్నారు. అలాగే అదనపు షోలకు కూడా పర్మిషన్ తీసుకుంటున్నారు. రెండు రోజుల్లో చిరంజీవి హీరోగా నటించిన భోళా శంకర్ సినిమా విడుద‌ల కానుంది. తొలి రెండు మూడు రోజులు తమ సినిమా టికెట్ ధర పెంచుకోవడానికి అనుమతి ఇవ్వాలని ఇప్పటికే ఆ మూవీ నిర్మాతలు ప్రభుత్వాన్ని అనుమతి కూడా కోరారు.

మామూలుగా అయితే అగ్ర హీరోలు నటించిన సినిమాలు విడుదల అవుతున్న సమయంలో టికెట్ ధరలు పెంచుకునే విషయమై ప్రభుత్వాన్ని అనుమతి కోరగానే వెంటనే లభిస్తోంది. అయితే ఇప్పుడు భోళా శంకర్ సినిమా టికెట్ల ధరలు పెంచుకోవడానికి ప్రభుత్వం అనుమతించలేదని ప్రచారం జరుగుతోంది. ఒకవైపు సినిమా విడుదలకు గంటలే మిగిలి ఉండగా ప్రభుత్వ వైఖరి నిర్మాతల‌కు టెన్షన్ పుట్టిస్తోంది.

బుక్ మై షో వంటి యాప్ లలో టికెట్లు విడుదల చేయాల్సి ఉండగా.. ప్రభుత్వ నిర్ణయం నిర్మాతల‌ను ఆందోళనలో పడేస్తోంది. టికెట్ రేట్ల పెంపునకు సంబంధించి నిర్మాతలు తమను సంప్రదించిన మాట వాస్తవమేనని ప్రభుత్వ వర్గాలు ధ్రువీకరిస్తున్నాయి. అయితే అప్లికేషన్ అసంపూర్తిగా ఉందని, పలు డాక్యుమెంట్లు సమర్పించలేదని ప్రభుత్వం భోళా శంకర్ సినిమా టికెట్ల ధరలు పెంచుకోవడానికి అనుమతి ఇవ్వలేదు.

ప్రభుత్వానికి వ్యతిరేకంగా చిరంజీవి వ్యాఖ్యలు చేసిన ఫలితంగానే ఇప్పుడు ఈ పరిస్థితి నెలకొందని సినీ ఇండస్ట్రీలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఏది ఏమైనా ప్రభుత్వంపై చిరంజీవి చేసిన వ్యాఖ్యలు నిర్మాతల‌ను ఇబ్బందుల్లో పడేశాయనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. రేపటిలోగా టికెట్ల ధరలు పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతించకపోతే భోళా శంకర్ సినిమా భారీగా నష్టపోయే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అంటున్నారు.

Tags:    
Advertisement

Similar News