మైనార్టీలకు ఏమేం చేశామంటే..?

ముస్లింలలో పేదలందరికి వైఎస్సార్‌ రిజర్వేషన్‌ లు అమలు చేశారని సీఎం జగన్ గుర్తు చేశారు. ఆయన స్ఫూర్తితోనే వైసీపీ హయాంలో కూడా మైనార్టీల కోసం పలు పథకాలు తీసుకొచ్చినట్టు చెప్పారు.

Advertisement
Update:2023-11-11 12:06 IST

సీఎం జగన్

ఏపీలో మైనార్టీలకు వైసీపీ ప్రభుత్వ హయాంలోనే న్యాయం జరిగిందని తెలిపారు సీఎం జగన్. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న ఆయన.. గత టీడీపీ ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టారు. గత ప్రభుత్వం మైనార్టీల అభివృద్ధిని గాలికొదిలేసిందని అన్నారు జగన్. గతానికి, ఇప్పటికి తేడాను మైనార్టీలు గమనించాలని కోరారు.

ఏమేం చేశామంటే..?

ముస్లింలలో పేదలందరికి వైఎస్సార్‌ రిజర్వేషన్‌ లు అమలు చేశారని సీఎం జగన్ గుర్తు చేశారు. ఆయన స్ఫూర్తితోనే వైసీపీ హయాంలో కూడా మైనార్టీల కోసం పలు పథకాలు తీసుకొచ్చినట్టు చెప్పారు. నలుగురు మైనార్టీలను ఎమ్మెల్యేలుగా గెలిపించుకున్నామని, వారికి మంత్రి వర్గంలో సముచిత స్థానం కల్పించామని చెప్పారు. శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్‌ గా ముస్లిం మహిళకు అవకాశం ఇచ్చామని తెలిపారు జగన్.

సాధికారిత అనేది మాటల్లో కాదు.. చేతల్లో చూపించామన్నారు జగన్. మైనార్టీల అభ్యున్నతి కోసం 2019 నుంచి అనేక మార్పులు తీసుకొచ్చామని, మంత్రి పదవులు ఇచ్చి ప్రోత్సహించామని చెప్పారు. లంచాలు, వివక్షకు తావులేకుండా పాలన కొనసాగిస్తున్నామన్నారు. భిన్నత్వంలో ఏకత్వం అనేదే మన బలం అని, ప్రతి పేదవాడి సంక్షేమం కోసం ఈ ప్రభుత్వం పని చేస్తోందన్నారు జగన్.

Tags:    
Advertisement

Similar News