ఎస్‌బీఐ చైర్మన్‌తో అగ్రికల్చర్‌ వర్సిటీ వీసీ భేటీ

ఏఐ ల్యాబ్‌ ఏర్పాటుకు సానుకూలత వ్యక్తం చేసిన ఎస్‌బీఐ చైర్మన్‌

Advertisement
Update:2024-12-02 19:11 IST

అగ్రికల్చర్‌ యూనివర్సిటీ పూర్వ విద్యార్థి, ఎస్‌బీఐ చైర్మన్‌ శ్రీనివాసులు శెట్టిని ప్రొఫెసర్‌ జయశంకర్‌ అగ్రికల్చర్‌ యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ అల్దాజ్‌ జానయ్య భేటీ అయ్యారు. సోమవారం ముంబయిలోని ఎస్‌బీఐ హెడ్‌ క్వార్టర్స్‌లో శెట్టిని జానయ్య మార్యాద పూర్వకంగా కలిశారు. త్వరలోనే నిర్వహించే యూనివర్సిటీ డైమండ్‌ జూబ్లీ వేడుకల్లో పాల్గొనాలని శెట్టిని ఆహ్వానించారు. శ్రీనివాసులు శెట్టి విద్యార్థిగా చదువుకున్న రాజేంద్రనగర్‌లోని అగ్రికల్చర్‌ వర్సిటీ ప్రాంగణంలో కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబులిటీ నిధులతో అడ్వాన్డ్స్‌ ఆర్టీఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ ల్యాబ్‌, మోడ్రన్‌ అగ్రికల్చర్‌ ల్యాబ్‌ ఏర్పాటు చేయాలని జానయ్య కోరారు. అందుకు ఎస్‌బీఐ చైర్మన్‌ సానుకూలంగా స్పందించారు. ఈనెల 20, 21 ఎస్‌బీఐ ఎండీ పాల్గొంటారని తెలిపారు. అగ్రికల్చర్‌ వర్సిటీలో స్టూడెంట్‌గా తన అనుభవాలను ఆయన వీసీతో పంచుకున్నారు. ఆయన వెంట డీన్ ఆఫ్ అగ్రికల్చర్ జెల్లా సత్యనారాయణ, ఇతర అధికారులు ఉన్నారు.

Tags:    
Advertisement

Similar News