డీసీసీబీలు, పీఏసీఎస్‌ల పదవీకాలం పొడిగింపు
ఆరు నెలలు పొడిగిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు
Advertisement
డిస్ట్రిక్ట్ సెంట్రల్ కో ఆపరేటివ్ బ్యాంక్ (డీసీసీబీ)లు, ప్రైమరీ అగ్రికల్చర్ కో ఆపరేటివ్ సొసైటీ (పీఏసీఎస్)ల పదవీ కాలాన్ని ఆరు నెలలు పొడిగిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. తొమ్మిది ఉమ్మడి జిల్లాల డీసీసీబీలతో పాటు 904 పీఏసీఎస్‌ల పదవీకాలం ఇదివరకే ముగిసింది. దీంతో ప్రభుత్వం వాటి కాలపరిమితి పొడిగించింది. పీఏసీఎస్‌ల ఎన్నికలు నిర్వహించేందుకు నిర్ణయం తీసుకోకపోవడంతోనే వాటి కాలపరిమితిని పొడిగించారు.
Advertisement