టీఆర్ఎస్ హయాంలో తెలంగాణలో ఐదు విప్లవాలు -కేటీఆర్
టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో ఐదు విప్లవాలు వచ్చాయని చెప్పారు మంత్రి కేటీఆర్. పటాన్ చెరులోని పాశమైలారం పారిశ్రామికవాడలో అల్ ప్లా ఇండియా పరిశ్రమలో వరల్డ్ క్లాస్ మౌల్డ్ యూనిట్, డ్యూయల్ ఎడ్యుకేషన్ సెంటర్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ఆయన టీఆర్ఎస్ ప్రభుత్వం ఐదు విప్లవాలు తీసుకొచ్చిందన్నారు.
టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో ఐదు విప్లవాలు వచ్చాయని చెప్పారు మంత్రి కేటీఆర్. పటాన్ చెరులోని పాశమైలారం పారిశ్రామికవాడలో అల్ ప్లా ఇండియా పరిశ్రమలో వరల్డ్ క్లాస్ మౌల్డ్ యూనిట్, డ్యూయల్ ఎడ్యుకేషన్ సెంటర్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ఆయన టీఆర్ఎస్ ప్రభుత్వం ఐదు విప్లవాలు తీసుకొచ్చిందన్నారు.
సస్య విప్లవంతో లక్ష ఎకరాలు సాగులోకి వచ్చాయని చెప్పారు కేటీఆర్. కాళేశ్వరం వంటి ప్రాజెక్ట్ లు, రైతు బంధు వంటి పథకాలతో తెలంగాణలో వ్యవసాయం పండగలా మారిందన్నారు. దేశంలోనే అత్యధికంగా వరి పండిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని వివరించారు. నీలి విప్లవంతో మన దేశ అవసరాలతో పాటు విదేశాలకు ఎగుమతి చేసే స్థాయిలో తెలంగాణలో చేపల ఉత్పత్తి ఉందని కేటీఆర్ తెలిపారు. క్షీర విప్లవంతో రాష్ట్రంలో పాల ఉత్పత్తి పెరిగిందన్నారు.
తెలంగాణ ఏర్పడే నాటికి అప్పులతో మూతపడే దశలో ఉన్న విజయా డెయిరీ.. ఇప్పుడు ప్రభుత్వానికి డివిడెండ్ ఇచ్చే స్థాయికి ఎదిగిందని, దానికి కారణం ప్రభుత్వ విధానాలేనన్నారు. గులాబీ విప్లవంతో మాంసం ఉత్పత్తి కూడా పెరిగిందని కేటీఆర్ చెప్పారు. పసుపు విప్లవంతో రాష్ట్రంలో నూనె గింజల ఉత్పత్తి పెరగబోతోందని చెప్పారు కేటీఆర్. వచ్చే ఐదేళ్లలో 25లక్షల ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగు లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు.
పెట్టుబడిదారులపై ఒత్తిడి లేదు..
సహజంగా ఏదైనా రాష్ట్రంలో కొత్తగా ఉత్పత్తి ప్రారంభించాలంటే, ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రోత్సాహం ఉంటుందో, రాజకీయ నాయకుల నుంచి ఎలాంటి బెదిరింపులు ఉంటాయోననే సందేహాలు రావడం కామన్. కానీ తెలంగాణలో పరిస్థితి అలా లేదని చెప్పారు కేటీఆర్. రాష్ట్రంలోని పారిశ్రామికవేత్తలపై, పెట్టుబడిదారులపై ఎలాంటి ఒత్తిడి లేదని కేటీఆర్ చెప్పారు.
ఈజ్ ఆఫ్ డూయింగ్ ద్వారా పెట్టుబడులు, పరిశ్రమల స్థాపనను ప్రోత్సహిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో స్థిరమైన, సామర్థ్యం ఉన్న ప్రభుత్వం ఉందని, అందుకే పారిశ్రామిక రంగ ఉత్పత్తిలో జాతీయ సగటు కంటే రాష్ట్ర సగటు అధికంగా ఉందని చెప్పారు కేటీఆర్. తెలంగాణలో సమ్మిళిత అభివృద్ధి జరగాలని ఉద్దేశంతో ముందుకు సాగుతున్నామన్నారు. దిగుమతులు తగ్గించి.. స్థానికంగా ఉత్పత్తి పెంచి.. స్థానిక యువతకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు కేటీఆర్.