వైసీపీ ప్లీనరీ.. రెండోరోజు షెడ్యూల్ ఇదే..
వైసీపీ ప్లీనరీ అట్టహాసంగా మొదలైంది. తొలిరోజు విజయమ్మ రాజీనామా అంశం హైలెట్ కాగా, జగన్ సహా ఇతర నేతల ప్రసంగం కార్యకర్తలకు ఊపు తెచ్చింది. తొలిరోజు నాలుగు తీర్మానాలు ఆమోదించారు. రెండో రోజు 4లక్షలమంది వస్తారని అంచనా. అందుకే మరింత కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. రెండోరోజు కూడా ప్రసంగాలదే కీలక పాత్ర. పార్టీ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం రెండోరోజు ప్లీనరీ ఉదయం 9.45 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలతో మొదలవుతుంది. అనంతరం 10.05 గంటల నుంచి సామాజిక […]
వైసీపీ ప్లీనరీ అట్టహాసంగా మొదలైంది. తొలిరోజు విజయమ్మ రాజీనామా అంశం హైలెట్ కాగా, జగన్ సహా ఇతర నేతల ప్రసంగం కార్యకర్తలకు ఊపు తెచ్చింది. తొలిరోజు నాలుగు తీర్మానాలు ఆమోదించారు. రెండో రోజు 4లక్షలమంది వస్తారని అంచనా. అందుకే మరింత కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.
రెండోరోజు కూడా ప్రసంగాలదే కీలక పాత్ర. పార్టీ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం రెండోరోజు ప్లీనరీ ఉదయం 9.45 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలతో మొదలవుతుంది. అనంతరం 10.05 గంటల నుంచి సామాజిక సాధికారతపై ప్రసంగాలు ఉంటాయి. 12.25గంటల వరకు మంత్రులు, ఎంపీలు ఈ అంశంపై ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 12.25 నుంచి 1.45 గంటల వరకు వ్యవసాయ రంగంపై నేతల ప్రసంగాలు ఉంటాయి. మధ్యాహ్నం 1.45 నుంచి 2 గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. మధ్యాహ్నం 2 గంటల నుంచి పరిశ్రమలు, ఎంఎస్ఎంఈ ప్రోత్సాహకాలపై ప్రసంగాలు ఉంటాయి.
భోజనాల తర్వాత ప్రతిపక్షాలకు వడ్డింపులు..
మధ్యాహ్నం 2.40 గంటలనుంచి ప్లీనరీలో అసలు ఘట్టం మొదలవుతుంది. సహజంగా ప్రెస్ మీట్లలోనే వైరి వర్గాలపై విరుచుకుపడిపోయే నేతలు మధ్యాహ్నం రంగంలోకి దిగుతారు. సబ్జెక్ట్ కూడా అదే. ఎల్లోమీడియా – దుష్టచతుష్టయం అనే సబ్జెక్ట్ పై నేతలు ప్రసంగిస్తారు. అంబటి రాంబాబు, జోగి రమేష్, కొడాలి నాని, పోసాని కృష్ణమురళి.. ఈ అంశంపై ఈ నలుగురు మాట్లాడతారు.
వైరి వర్గం మీడియాలో వచ్చే కథనాలు ఎలా ఉంటాయి, వాటిని ఎలా తిప్పికొట్టాలనే విషయాలపై నేతలు కార్యకర్తలకు సూచనలిచ్చే అవకాశముంది. ఆ తర్వాత పార్టీ అధ్యక్ష ఎన్నిక ప్రకటన, పార్టీ రాజ్యాంగ సవరణలు, ఆమోదం అనే కార్యక్రమాలుంటాయి. జగన్ ని పార్టీ శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నుకుంటారు. ఆ తర్వాత అధ్యక్షుడికి అభినందనలు తెలుపుతారు. చివరిగా పార్టీ అధ్యక్షుడి హోదాలో సీఎం జగన్ ప్రసంగం అనంతరం వందన సమర్పణ, జాతీయ గీతాలాపనతో సాయంత్రం 5.10గంటలకు ప్లీనరీ సమావేశాలు ముగుస్తాయి.