ఆ 42 మంది సిట్టింగులు డౌటే! గులాబీలో మూడు సర్వేల గుబులు
ఒకటి కాదు.. రెండు కాదు.. మూడు సర్వేలు ఇప్పుడు టీఆర్‌ఎస్‌లో టెన్షన్ పుట్టిస్తున్నాయి. ఏకకాలంలో జరుగుతున్న మూడు సర్వేలు గులాబీ నేతల్లో గుబులు రేపుతున్నాయి. ప్రశాంత్ కిషోర్ టీమ్ సర్వే ఓ వైపు కొనసాగుతుంటే.. మరో రెండు సర్వేలు కూడా నిర్వహిస్తున్నారట. జిల్లా అధ్యక్షులతో పాటు ఎమ్మెల్యేలు తమతమ నియోజకవర్గాల్లో సర్వే చేయిస్తున్నారట. గ్రామస్థాయిలో ఫోకస్ చేసి ఎమ్మెల్యేలు సర్వే నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ పాలన తీరు, సంక్షేమ పథకాలకు స్పందన, ఎమ్మెల్యేల పనితీరు, ప్రత్యర్థులెవరు? అనే అంశాలపై […]
ఒకటి కాదు.. రెండు కాదు.. మూడు సర్వేలు ఇప్పుడు టీఆర్‌ఎస్‌లో టెన్షన్ పుట్టిస్తున్నాయి. ఏకకాలంలో జరుగుతున్న మూడు సర్వేలు గులాబీ నేతల్లో గుబులు రేపుతున్నాయి. ప్రశాంత్ కిషోర్ టీమ్ సర్వే ఓ వైపు కొనసాగుతుంటే.. మరో రెండు సర్వేలు కూడా నిర్వహిస్తున్నారట. జిల్లా అధ్యక్షులతో పాటు ఎమ్మెల్యేలు తమతమ నియోజకవర్గాల్లో సర్వే చేయిస్తున్నారట.
గ్రామస్థాయిలో ఫోకస్ చేసి ఎమ్మెల్యేలు సర్వే నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ పాలన తీరు, సంక్షేమ పథకాలకు స్పందన, ఎమ్మెల్యేల పనితీరు, ప్రత్యర్థులెవరు? అనే అంశాలపై వివరాలు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేల సొంత సర్వే వివరాలను కూడా అధిష్టానానికి పంపాలని ఆదేశాలు జారీచేశారట. ఇటు జిల్లా అధ్యక్షుల సర్వే నెలరోజుల్లో పూర్తి చేసి నివేదిక అందిస్తారని తెలుస్తోంది.
ఇప్పటికే 42 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత ఉన్నట్లు పీకే సర్వేలో తేలింది. పార్టీ నేతలతో పాటు గ్రామాల్లో కూడా వీరిని జనం పట్టించుకోవడం లేదని సర్వే సారాంశం. ఈ సర్వేలో కొందరు ఎమ్మెల్యేలు నాల్గవ స్థానానికి కూడా పడిపోయారట. ఎల్లారెడ్డి, చొప్పదండి, జగిత్యాల, ఖానాపూర్ ఎమ్మెల్యేల గ్రాఫ్ ఘోరంగా పడిపోయిందట. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజుల సురేందర్ నాల్గవ స్థానానికి పడిపోయిన లిస్ట్‌లో ఉన్నారట. దీంతో ఈ మధ్య ఈయన నియోజకవర్గంలో తిరుగుతున్నారట.
ఈ నెలలో నిర్వహిస్తున్న మూడు సర్వేల ఫలితాల తర్వాత ఎమ్మెల్యేలతో సీఎం కేసీఆర్ విడివిడిగా సమావేశమవుతారని తెలిసింది. ఆ మీటింగ్‌లో సీట్లపై క్లారిటీ ఇస్తారని అంటున్నారు. మొత్తానికి రాబోయే సర్వేలు గులాబీ నేతల తలరాతను నిర్ణయిస్తాయని తెలుస్తోంది.