ఏరోస్పేస్ వ్యాలీగా హైదరాబాద్ కి మరో ఘనత..

విమానయాన పరికరాల తయారీలో ప్రపంచ ప్రఖ్యాత సంస్థ ‘సాఫ్రాన్’ హైదరాబాద్ లో మెగా ఏరో ఇంజిన్ ప్రాజెక్ట్ (MRO) ప్రారంభించబోతోంది. విశేషం ఏంటంటే.. ప్రపంచంలోనే ఆ సంస్థకు ఉన్న మెగా ఏరో ఇంజిన్ ప్రాజెక్ట్ లలో ఇదే అతి పెద్దది అవుతుంది. ఈ నేపథ్యంలో సాఫ్రాన్ గ్రూప్ కి తెలంగాణ మంత్రి కేటీఆర్ స్వాగతం పలికారు. సాఫ్రాన్ కంపెనీకి సాదర స్వాగతం అంటూ ఆయన ట్వీట్ చేశారు. భారతదేశంలో తన మెగా ఏరో ఇంజిన్ (MRO) కోసం […]

Advertisement
Update:2022-07-06 09:23 IST

విమానయాన పరికరాల తయారీలో ప్రపంచ ప్రఖ్యాత సంస్థ ‘సాఫ్రాన్’ హైదరాబాద్ లో మెగా ఏరో ఇంజిన్ ప్రాజెక్ట్ (MRO) ప్రారంభించబోతోంది. విశేషం ఏంటంటే.. ప్రపంచంలోనే ఆ సంస్థకు ఉన్న మెగా ఏరో ఇంజిన్ ప్రాజెక్ట్ లలో ఇదే అతి పెద్దది అవుతుంది. ఈ నేపథ్యంలో సాఫ్రాన్ గ్రూప్ కి తెలంగాణ మంత్రి కేటీఆర్ స్వాగతం పలికారు.

సాఫ్రాన్ కంపెనీకి సాదర స్వాగతం అంటూ ఆయన ట్వీట్ చేశారు. భారతదేశంలో తన మెగా ఏరో ఇంజిన్ (MRO) కోసం సాఫ్రాన్ సంస్థ హైదరాబాద్‌ ను ఎంచుకోవాలని తీసుకున్న నిర్ణయాన్ని ఆయన స్వాగతించారు. ప్రపంచ వ్యాప్తంగా సాఫ్రాన్ కంపెనీకి సంబంధించి ఇది అతి పెద్ద MRO కావడమే కాకుండా.. భారతదేశంలో ఒరిజినల్ ఎక్విప్ మెంట్ మ్యాన్యుఫ్యాక్చరర్ (OEM) ద్వారా స్థాపించబడే మొదటి ఇంజిన్ కూడా కావడం విశేషం అని ట్వీట్ లో పేర్కొన్నారు కేటీఆర్.

MRO, ఇంజిన్ టెస్ట్ సెల్ కోసం హైదరాబాద్ లో 150 మిలియన్ అమెరికన్ డాలర్ల పెట్టుబడి పెట్టబోతోంది సాఫ్రాన్ సంస్థ. ఇది ప్రారంభ పెట్టుబడి మాత్రమేనని, ముందు ముందు మరిన్ని పెట్టుబడులు తరలి వస్తాయని చెబుతున్నారు కేటీఆర్. ఈ కంపెనీ ద్వారా దాదాపు వెయ్యి మంది హైస్కిల్డ్ లేబర్ కి ఉద్యోగ అవకాశాలు కలుగుతాయని చెప్పారు. పరోక్షంగా మరో 5వేలమందికి ఉపాధి మార్గం దొరుకుతుంది.

సాఫ్రాన్ కంపెనీ MRO, ఇంజిన్ టెస్ట్ సెల్ ద్వారా తయారయ్యే ఉపకరణాలను భారతీయ, విదేశీ వాణిజ్య విమానయాన సంస్థలు ఉపయోగిస్తాయి. ప్రస్తుతం విమానయానరంగంలో లీడింగ్ లో ఉన్న లీప్ 1A , లీప్ 1B ఏరో ఇంజిన్‌ లకు సాప్రాన్ ఉత్పత్తులు అవసరం అవుతాయి. తెలంగాణలోని స్థానిక ఏరోస్పేస్ ప్రోడక్ట్స్, ఏవియేషన్ పర్యావరణ వ్యవస్థపై సాఫ్రాన్ సంస్థ ప్రభావం గణనీయంగా కనపడుతుందని అంచనా వేస్తున్నారు.

ఇప్పటికే సిలికాన్ వ్యాలీగా పేరొందిన హైదరాబాద్ ఇటీవల, కరోనా వ్యాక్సిన్ తయారీతో ఫార్మా హబ్ గా కూడా మారింది. తాజాగా సాఫ్రాన్ సంస్థ పెట్టుబడులతో.. కొత్తగా ఏర్పడే కంపెనీలతో భారత్ లో శక్తిమంతమైన ఏరోస్పేస్ వ్యాలీగా కూడా పేరు తెచ్చుకుంటుందనడంలో అతిశయోక్తి లేదు.

Tags:    
Advertisement

Similar News