మహా సీఎం పోస్టు చెరి సగం!

రెండున్నరేళ్లు ఫడ్నవీస్‌.. రెండున్నరేళ్లు షిందే సీఎం

Advertisement
Update:2024-11-25 21:35 IST

మహారాష్ట్ర సీఎం పదవిని చెరిసగం పంచుకోవాలని మహాయుతి కూటమిలోని రెండు ప్రధాన పార్టీలు నిర్ణయానికి వచ్చాయని తెలుస్తోంది. ఈమేరకు కేంద్ర ప్రభుత్వ పెద్దల సమక్షంలో అంగీకారం కుదిరినట్టుగా ఢిల్లీ పొలిటికల్‌ సర్కిల్స్‌ లో టాక్‌ వినిపిస్తోంది. మొదటి రెండున్నరేళ్లు బీజేపీ నాయకుడు, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ ముఖ్యమంత్రిగా ఉంటారు. ఆ తర్వాత రెండేళ్లు శివసేన (షిందే) చీఫ్‌ ఏక్‌నాథ్‌ షిందే ముఖ్యమంత్రిగా కొనసాగుతారు. ఈ ఫిఫ్టీ 50 ఫార్ములాకు రెండు పార్టీల ముఖ్య నేతలు అంగీకారం తెలిపినట్టుగా సమాచారం. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి గెలిస్తే ఏక్‌నాథ్‌ శిందేనే ముఖ్యమంత్రి అవుతారని ఎన్నికల ప్రచారంలో బీజేపీ నేతలు చెప్పారు. 288 అసెంబ్లీ స్థానాలున్న మహారాష్ట్ర అసెంబ్లీలో బీజేపీ ఏకంగా 132 సీట్లు గెలుచుకుంది. శివసేన (షిందే) 57 స్థానాల్లో విజయడంకా మోగించింది. ఎన్నికలకు ముందు ఏక్‌నాథ్‌ షిందేను సీఎం చేస్తామని మాట ఇచ్చారు కాబట్టే రెండున్నరేళ్లు ఆయనకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చేందుకు బీజేపీ హైకమాండ్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్టు తెలుస్తోంది. బీజేపీ ఎక్కువ సీట్లు గెలిచింది కాబట్టే ఫడ్నవీస్‌ నే సీఎం చేయాలని మహారాష్ట్ర బీజేపీ నేతలు పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలో వారికి పార్టీ అధినాయకత్వం నచ్చజెప్పి ఫిఫ్టీ 50 ఫార్ములాకు ఓకే చెప్పిచ్చిందని సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

Tags:    
Advertisement

Similar News