ప్రభుత్వ నిర్లక్ష్యానికి విద్యార్థిని బలి

శైలజ మృతికి ప్రభుత్వం బాధ్యత వహించాలి : బీఆర్‌ఎస్‌ నాయకుడు మేడె రాజీవ్‌ సాగర్‌

Advertisement
Update:2024-11-26 19:06 IST

రేవంత్‌ రెడ్డి ప్రభుత్వ నిర్లక్ష్యానికి గిరిజన గురుకుల విద్యార్థిని శైలజ బలైందని బీఆర్‌ఎస్‌ నాయకుడు, తెలంగాణ ఫుడ్స్‌ మాజీ చైర్మన్‌ మేడె రాజీవ్‌ సాగర్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఎంతో భవిష్యత్‌ ఉన్న విద్యార్థిని ఫుడ్‌ పాయిజన్‌ కు బలికావడం దురదృష్టకరమన్నారు. కార్పొరేట్‌ విద్యాసంస్థలకు కొమ్ము కాసేందుకే రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం కేసీఆర్‌ నెలకొల్పిన గురుకులాలను నిర్లక్ష్యం చేస్తున్నారని అన్నారు. 25 రోజులుగా నిమ్స్‌ లో వెంటిలేటర్‌పై ఆ చిన్నారి అనుభవించిన నరకానికి ప్రభుత్వమే కారణమన్నారు. రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత 11 నెలల్లోనే 42 మంది గురుకుల విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని, నిత్యం ఏదో ఒక చోట కలుషిత ఆహారం తిని విద్యార్థులు ఆస్పత్రుల పాలవుతున్నారని తెలిపారు. వాంకిడి గురుకుల విద్యార్థులకు కలుషిత ఆహారం పెట్టడంతో పాటు అనారోగ్యం పాలైన వారికి సకాలంలో మెరుగైన వైద్యం కూడా అందించలేదని, అందుకే శైలజ ప్రాణాలు కోల్పోయిందని అన్నారు. మృతిచెందిన విద్యార్థిని కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు.

Tags:    
Advertisement

Similar News