జగన్ తో మెగా స్టార్.. జనసేనపై ట్రోలింగ్..

భీమవరంలో జరిగిన అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాల సభలో సీఎం జగన్, చిరంజీవి ఆలింగనం ఆసక్తిగా మారింది. జగన్ తన ప్రసంగంలో ‘నా సోదరుడు చిరంజీవి’ అనడం కూడా అందర్నీ ఆకట్టుకుంది. అయితే ఈ విషయాన్ని వైసీపీ అభిమానులు సోషల్ మీడయాలో హైలెట్ చేస్తున్నారు. పరోక్షంగా జనసేనపై ట్రోలింగ్ మొదలు పెట్టారు. భీమవరం సభకు పవన్ కల్యాణ్ కు ఆహ్వాం లేదు, ఆయన కూడా అంటీ ముట్టనట్టుగానే ఉన్నారు. ఇక అదే సభకు చిరంజీవిని కేంద్రం ఆహ్వానించడం, […]

Advertisement
Update:2022-07-05 05:49 IST

భీమవరంలో జరిగిన అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాల సభలో సీఎం జగన్, చిరంజీవి ఆలింగనం ఆసక్తిగా మారింది. జగన్ తన ప్రసంగంలో ‘నా సోదరుడు చిరంజీవి’ అనడం కూడా అందర్నీ ఆకట్టుకుంది. అయితే ఈ విషయాన్ని వైసీపీ అభిమానులు సోషల్ మీడయాలో హైలెట్ చేస్తున్నారు. పరోక్షంగా జనసేనపై ట్రోలింగ్ మొదలు పెట్టారు.

భీమవరం సభకు పవన్ కల్యాణ్ కు ఆహ్వాం లేదు, ఆయన కూడా అంటీ ముట్టనట్టుగానే ఉన్నారు. ఇక అదే సభకు చిరంజీవిని కేంద్రం ఆహ్వానించడం, ఆయన ఆ ఆహ్వానాన్ని మన్నించి సభకు రావడం జనసేనకు మింగుడు పడలేదు. పోనీ కేంద్రం పిలిస్తే వచ్చారని అనుకుంటే.. సభా వేదికపై జగన్ తో సన్నిహితంగా ఉన్నారు చిరంజీవి. వారి పలకరింపు, కరచాలనం, ఆలింగనం.. జనసైనికులకు ఇబ్బందికరంగా మారాయి. ఓవైపు పవన్ కల్యాణ్, సీఎం జగన్ ని తీవ్రంగా విమర్శిస్తుంటారు. అదే సమయంలో చిరంజీవి మాత్రం జగన్ ని అభిమానిస్తుంటారు. ఇదెక్కడి లాజిక్కో జనసైనికులకు అర్థం కావడంలేదు.

సభ తర్వాత వైసీపీ అభిమానులు, జనసేన పుండుమీద మరింత కారం చల్లారు. వైసీపీ కార్యకర్తలు, సోషల్ మీడియా యాక్టివిస్ట్ లు జగన్, చిరు ఆలింగనాన్ని హైలెట్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు. గతంలో సోదర ప్రేమపై పవన్ వేసిన సెటైర్లు, తాజా సభలో చిరంజీవి తనకు సోదరుడంటూ జగన్ చేసిన వ్యాఖ్యల్ని పోలుస్తూ పవన్ ని విమర్శిస్తున్నారు. చిరంజీవి ఎప్పటికీ జగన్ ని అభిమానిస్తుంటారని, వైసీపీ సంక్షేమ పథకాలను ఎవరైనా మెచ్చుకుని తీరాల్సిందేనని చెబుతున్నారు.

ఎన్నికల నాటికి చిరంజీవిని ఎలాగైనా జనసేనవైపు తీసుకు రావాలని, కనీసం పవన్ పోటీ చేసే నియోజకవర్గంలో అయినా ఆయన ప్రచారం చేస్తారనే ఆశ జనసైనికుల్లో ఉంది. మెగా బ్రదర్స్ అందరూ కలిస్తే జనసేనకు ఊపొస్తుందనేది వారి ఆశ. కానీ ఇక్కడ చిరు మాత్రం జగన్ తో సఖ్యతగా ఉంటున్నారు. ఇలాంటి చిరు, రేపు జనసేన తరపున ఎన్నికల ప్రచారానికి వస్తారని, వచ్చినా జగన్ ని విమర్శిస్తారని అనుకోలేం. అదే ఇప్పుడు జనసైనికుల బాధ, ఆవేదన. మొత్తానికి భీమవరం సభ జనసైనికులకు ఓ పీడకలగా మారింది.

Tags:    
Advertisement

Similar News