నిరసన తెలుపుతున్న దళితులపై బీజేపీ దాడి
హైదరాబాద్‌లో జరిగిన ప్రధాని నరేంద్ర మోడీ సభలో నిరసన తెలుపుతున్న దళిత ఆందోళనకారులపై బీజేపీ కార్యకర్తలు దాడి చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బీజేపీ కార్యకర్తలు ఆందోళనకారులను తరుముతూ వెంటపడి కొట్టడం కనిపించింది. రాష్ట్రంలో ఎస్సీలు, ఇతర వర్గాల చిరకాల డిమాండ్ అయిన షెడ్యూల్డ్ కులాల వర్గీకరణపై ప్రధాని మోడీ ఇచ్చిన హామీలను గుర్తుచేస్తూ ఎంఆర్పీఎస్ సభ్యులు ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఈ ప్రదర్శనపై కొందరు బీజేపీ కార్యకర్తలు విరుచుకుపడి ఆందోళనకారులపై […]
హైదరాబాద్‌లో జరిగిన ప్రధాని నరేంద్ర మోడీ సభలో నిరసన తెలుపుతున్న దళిత ఆందోళనకారులపై బీజేపీ కార్యకర్తలు దాడి చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బీజేపీ కార్యకర్తలు ఆందోళనకారులను తరుముతూ వెంటపడి కొట్టడం కనిపించింది.
రాష్ట్రంలో ఎస్సీలు, ఇతర వర్గాల చిరకాల డిమాండ్ అయిన షెడ్యూల్డ్ కులాల వర్గీకరణపై ప్రధాని మోడీ ఇచ్చిన హామీలను గుర్తుచేస్తూ ఎంఆర్పీఎస్ సభ్యులు ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఈ ప్రదర్శనపై కొందరు బీజేపీ కార్యకర్తలు విరుచుకుపడి ఆందోళనకారులపై దాడి చేశారు. బీజేపీ కార్యకర్తల దాడిని సామాజిక మాధ్యమాల్లో పలువురు ఖండిస్తున్నారు. టీఆర్‌ఎస్ నేత ఎం. క్రిషాంక్ బీజేపీ దాడిని ఖండిస్తూ ట్వీట్ చేశారు. బీజేపీలో రానురానూ అసహనం పెరిగిపోతోందని విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణలో చేస్తున్న అభివృద్ధిని ఓర్వలేక బీజేపీ అరాచకం సృష్టిస్తోందని పలువురు టీఆర్ఎస్ నేతలు ధ్వజమెత్తారు.
జూలై 3వ తేదీ ఆదివారం నాడు హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద ఎంఆర్పీఎస్ ర్యాలీ నిర్వహించింది. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం జరుగుతున్న హైటెక్స్ వద్ద కూడా ఎమ్మార్పీఎస్ నేతలు రోడ్డు దిగ్బంధానికి యత్నించారు. దీంతో పలువురు ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మంద కృష్ణమాదిగ సారథ్యంలోని ఎంఆర్పిఎస్ తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ ఉప వర్గీకరణ కోసం 20 ఏళ్లకు పైగా ఆందోళనలకు నాయకత్వం వహిస్తూ, తక్కువ ప్రాతినిధ్యం ఉన్న ఎస్సీ వర్గాలకు న్యాయం చేయాలని కోరుతోంది.. రాష్ట్రంలో ఎస్సీల ఉప కేటగిరీకి సంబంధించి కేంద్రప్రభుత్వం చర్యలు తీసుకోకుంటే జూలై 2, 3 తేదీల్లో బీజేపీ రెండు రోజుల జాతీయ కార్యవర్గ సమావేశంలో ఆందోళనలు చేస్తామని మంద కృష్ణ మాదిగ ముందుగానే హెచ్చరించారు.