కొద్ది సేపట్లో హైదరాబాద్ లో టీఆరెస్ భారీ ర్యాలీ -పాల్గొననున్న కేసీఆర్

విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ ఈ రోజు హైదరాబాద్ రానున్నారు. ఈ సందర్భంగా టీఆరెస్ ఆయనకు పెద్ద ఎత్తున స్వాగతం చెప్పేందుకు ఏర్పాట్లు చేసింది. ఉదయం 11 గంటలకు ఎయిర్ పోర్టుకు చేరుకోనున్న యశ్వంత్ సిన్హాకు సీఎం కేసీఆర్ స్వయంగా వెళ్లి ఘన స్వాగతం పలకనున్నారు. అక్కడి నుంచి జలవిహార్ విహార్ వరకు టీఆరెస్ కార్యకర్తలు భారీ బైక్ ర్యాలీతో యశ్వంత్ సిన్హాను తీసుకెళ్తారు. జలవిహార్ లో ఆయన టీఆరెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలతో సమావేశమవుతారు. తనకు మద్దతు […]

Advertisement
Update:2022-07-02 04:46 IST

విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ ఈ రోజు హైదరాబాద్ రానున్నారు. ఈ సందర్భంగా టీఆరెస్ ఆయనకు పెద్ద ఎత్తున స్వాగతం చెప్పేందుకు ఏర్పాట్లు చేసింది. ఉదయం 11 గంటలకు ఎయిర్ పోర్టుకు చేరుకోనున్న యశ్వంత్ సిన్హాకు సీఎం కేసీఆర్ స్వయంగా వెళ్లి ఘన స్వాగతం పలకనున్నారు. అక్కడి నుంచి జలవిహార్ విహార్ వరకు టీఆరెస్ కార్యకర్తలు భారీ బైక్ ర్యాలీతో యశ్వంత్ సిన్హాను తీసుకెళ్తారు.

జలవిహార్ లో ఆయన టీఆరెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలతో సమావేశమవుతారు. తనకు మద్దతు ఇవ్వవల్సిందిగా వారిని కోరుతారు. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ తో కలిసి యశ్వంత్ సిన్హా భోజనం చేస్తారు. అనంతరం ఆయన ఐటీసీ కాకతీయ హోటల్ కు వెళ్తారు. అక్కడ 3.30 గంటల సమయంలో ఎంఐఎం ఎంపీ, ఎమ్మెల్యేలతో సమావేశమై తనకు మద్దతు ఇవ్వవలసిందిగా కోరుతారు.

ఈ మొత్తం కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి టీఆరెస్ భారీ ఏర్పాట్లే చేసింది. యశ్వంత్ సిన్హాకు స్వాగతం చెప్తూ హైదరాబాద్ నగరమంతా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఆయన కు స్వాగత కార్యక్రమం కూడా భారీ ఎత్తున ఉండేలా జాగ్రత్త పడింది. వేలాది మంది కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు.

మరో వైపు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ఈ రోజే ప్రారంభం కాబోతున్నాయి. ప్రధాని మోదీ సహా బీజేపీ అగ్రనేతలంతా ఈ రోజే హైదరాబాద్ లో అడుగుపెట్టబోతున్నారు. వారికి భారీ ఎత్తున స్వాగతం పలికి తన‌ సత్తా చూయించుకోవాలని తెలంగాణ బీజేపీ ఛీఫ్ బండి సంజయ్ తహతహలాడుతున్న సమయంలో టీఆరెస్ తన బల ప్రదర్శనకు దిగడం ఆసక్తిని కలిగిస్తోంది.

Tags:    
Advertisement

Similar News