రైలుకు పుట్టిన రోజు వేడుకలు..

పుట్టిన రోజంటే చాలా మందికి ప్రత్యేకం. ముఖ్యంగా చిన్నపిల్లలు అయితే కొత్త బట్టలు వేసుకొని.. స్కూల్‌కు చాక్లెట్లు తీసుకెళ్లి ఫ్రెండ్స్‌కు పంచి అమితానందాన్ని పొందుతారు. ఇక కాలేజీ డేస్‌కు వచ్చాక.. ఫ్రెండ్స్ కేక్ తీసుకొని వచ్చి సర్‌ప్రైజ్ చేస్తుంటారు. ఇక్కడ కూడా ఒకరి పుట్టినరోజును ఘనంగా నిర్వహించారు. అది ఫ్రెండో, బంధువో, క్లాస్‌మేట్ పుట్టిన రోజో కాదు. తాము రోజు ప్రయాణించే రైలు పుట్టినరోజును ఘనంగా నిర్వహించి తమ ప్రేమను చాటుకున్నారు. విజయవాడ-చెన్నై మధ్య నడిచే పినాకినీ […]

Advertisement
Update:2022-07-02 03:32 IST

పుట్టిన రోజంటే చాలా మందికి ప్రత్యేకం. ముఖ్యంగా చిన్నపిల్లలు అయితే కొత్త బట్టలు వేసుకొని.. స్కూల్‌కు చాక్లెట్లు తీసుకెళ్లి ఫ్రెండ్స్‌కు పంచి అమితానందాన్ని పొందుతారు. ఇక కాలేజీ డేస్‌కు వచ్చాక.. ఫ్రెండ్స్ కేక్ తీసుకొని వచ్చి సర్‌ప్రైజ్ చేస్తుంటారు. ఇక్కడ కూడా ఒకరి పుట్టినరోజును ఘనంగా నిర్వహించారు. అది ఫ్రెండో, బంధువో, క్లాస్‌మేట్ పుట్టిన రోజో కాదు. తాము రోజు ప్రయాణించే రైలు పుట్టినరోజును ఘనంగా నిర్వహించి తమ ప్రేమను చాటుకున్నారు.

విజయవాడ-చెన్నై మధ్య నడిచే పినాకినీ ఎక్స్‌ప్రెస్ 30 ఏళ్ల క్రితం ప్రారంభమైంది. 1992 జూలై 1 ప్రారంభమైన ఈ రైలు 12711/12712 నెంబర్లతో ప్రతీ రోజు ఈ రెండు నగరాల మధ్య నడుస్తోంది. ప్రతీ రోజు వందలాది మంది విద్యార్థులు, వ్యాపారులు, ఉద్యోగులకు ఈ రైలు ప్రయాణమే ఆధారం. ఉదయమైతే చాలు ట్రెయిన్‌లో కోలాహలం మొదలవుతుంది. ఇందులో ఎక్కువగా సీజనల్ టికెట్ ప్రయాణికులే ఎక్కువగా ఉంటుంటారు. దీంతో ఈ ట్రెయిన్‌లో ప్రయాణించే వారందరూ బంధువుల్లా కలిసిపోయారు.

సొంత ముచ్చట్ల నుంచి ఢిల్లీ రాజకీయ వరకు ఈ ప్రయాణంలో చర్చించుకోవడమే కాకుండా.. చాలా మంది ఫ్యామిలీ ఫ్రెండ్స్‌గా కూడా మారిపోయారు. ఎంతో మందికి కొత్త స్నేహాలను, ప్రేమలను ఇచ్చింది ఈ ట్రెయిన్. అందుకే ఆ రైలంటే వాళ్లకు చాలా ఇష్టం. కరోనా కారణంగా కొన్నాళ్లు ఈ ట్రెయిన్‌లో ప్రయాణించలేకపోయినా.. ఈ ఏడాది ఆ రైలుకు 30 ఏళ్లు నిండటంతో దాని అభిమానులు పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు.

విజయవాడ ప్లాట్ ఫామ్ నెంబర్ 1 మీద ‘పినాకినీ ఎక్స్‌ప్రెస్’ బర్త్ డే సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు. రైలు ఇంజన్‌కు పూలతో డెకరేట్ చేసి.. దాని పక్కనే రైలు లోకో పైలెట్‌తో కేట్ కట్ చేయించారు. ఈ కార్యక్రమంలో ఈఎల్ఎస్ సీనియర్ డీఈఈ దినేశ్ రెడ్డి, కోచింగ్ డిపో ఆఫీసర్ ఉదయ్ భాస్కర్, స్టేషన్ డైరెక్టర్ పిబీఎన్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. రెగ్యులర్ ప్యాసింజర్లు రైల్వే సిబ్బంది, తోటి ప్రయాణికులతో సెల్ఫీలు దిగుతూ ఆనందంగా గడిపారు.

Tags:    
Advertisement

Similar News