ప్రజల కోసమైతే గేట్లు మూసేస్తారు… బీజేపీ కోసమైతే గోడలు కూల్చేస్తారు
హైదరాబాద్ కంటోన్మెంట్ లో జీవిస్తున్న ప్రజలు, మల్కాజిగిరి నుంచి నగరంలోకి వచ్చే ప్రజలు నడిచే, ప్రయాణించే దారిలేక అనేక ఏళ్ళుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆర్మీ వాళ్ళు తమ రోడ్ల మీద ప్రజలు ప్రయాణించకుండా అనేక ఇబ్బందులు కలిగిస్తున్నారు. గేట్లను మూసి వేస్తున్నారు. ఈ విషయంపై ప్రజలు, తెలంగాణ ప్రభుత్వం అనేక సార్లు ఆర్మీ అధికారులను కలిసి విజ్ఞప్తులు చేశారు. టీఆరెస్ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వం ఇక్కడి ప్రజల ఇబ్బందులను తొలగించడానికి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా సంప్రదించింది. […]
హైదరాబాద్ కంటోన్మెంట్ లో జీవిస్తున్న ప్రజలు, మల్కాజిగిరి నుంచి నగరంలోకి వచ్చే ప్రజలు నడిచే, ప్రయాణించే దారిలేక అనేక ఏళ్ళుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆర్మీ వాళ్ళు తమ రోడ్ల మీద ప్రజలు ప్రయాణించకుండా అనేక ఇబ్బందులు కలిగిస్తున్నారు. గేట్లను మూసి వేస్తున్నారు.
ఈ విషయంపై ప్రజలు, తెలంగాణ ప్రభుత్వం అనేక సార్లు ఆర్మీ అధికారులను కలిసి విజ్ఞప్తులు చేశారు. టీఆరెస్ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వం ఇక్కడి ప్రజల ఇబ్బందులను తొలగించడానికి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా సంప్రదించింది. సహకరించమని కోరింది.
కానీ అటు కేంద్ర బీజేపీ సర్కార్ కానీ ఇటు ఆర్మీ అధికారులు కానీ అక్కడ నివసించే ప్రజలను కనికరించలేదు. ఈ విషయంపై మంత్రి కేటీఆర్ ఒక సారి కాస్త ఆగ్రహంగా మాట్లాడినందుకు అటు అధికారులు, బీజేపీ నాయకులు ఆయనపైనే విరుచుకపడ్డారు.
ప్రజల కోసం చిన్న సహాయం చేయడానికి కూడా సహకరించని బీజేపీ సర్కార్, ఆర్మీ అధికారులు బీజెపి పార్టీ కోసం మాత్రం ఇప్పుడు అన్ని నిబంధనలను పక్కనపెట్టారు.
హైదరాబాద్ లో జరగనున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల చివరి రోజు పరేడ్ గ్రౌండ్ లో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. పరేడ్ గ్రౌండ్ ఆర్మీ అధీనంలో ఉంది. ఆర్మీ అధికారులు బీజేపీ బహిరంగ సభకు అనుమతి ఇవ్వడమే కాక సభకు వచ్చే నాయకులు, కార్యకర్తల కోసం ఏకంగా పరేడ్ గ్రౌండ్ గోడనే కూల్చి వేశారు.
దీనిపై సోషల్ మీడియాలో నెటిజనులు తీవ్రంగా మండిపడుతున్నారు. టీఆరెస్ నేత, కంటోన్మెంట్ లో నివసించే క్రిషాంక్ ఓ ట్వీట్ చేశారు.
”కంటోన్మెంట్, మల్కాజిగిరి ప్రజలు రోడ్లు మూసివేతతో సంవత్సరాల తరబడి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, కానీ కంటోన్మెంట్ బోర్డు రోడ్లను తెరవడానికి ప్రయత్నాలు చేయలేదు, కానీ బిజెపి రాజకీయ మీటింగ్ కోసం పరేడ్ గ్రౌండ్ గోడను కూల్చివేసింది.” అని ఆయన ట్వీట్ లో పేర్కొన్నారు.
ఆ ట్వీట్ ను అనేక మంది నెటిజనులు షేర్లు చేస్తున్నారు. బీజేపీ కి వ్యతిరేకంగా కామెంట్లు చేస్తున్నారు. మంత్రి కేటీఆర్ ఆ ట్వీట్ ను లైక్ చేశారు.