స్టేట్ ఐటీ హెడ్ గా సునీల్..

వైసీపీ అనుబంధ విభాగాల అధ్యక్ష పదవులను భర్తీ చేశారు సీఎం జగన్. మొత్తం 24 విభాగాలకు అధ్యక్షులను నియమించారు. కీలకమైన ఐటీ విభాగానికి పోశింరెడ్డి సునీల్ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. నెల్లూరు జిల్లాకు చెందిన పోశింరెడ్డి సునీల్ కి జగన్ తో వ్యక్తిగతంగా మంచి అనుబంధం ఉంది. ఆ సన్నిహిత సంబంధాల వల్లే జగన్ ఆయనకు ఐటీ వంటి కీలక విభాగాన్ని అప్పగించారని తెలుస్తోంది. సోషల్ మీడియాలోయాక్టివ్ గా ఉంటూ, పార్టీ కార్యకలాపాలలో చురుగ్గా ఉండే సునీల్ ఇప్పుడు […]

Advertisement
Update:2022-06-29 02:21 IST

వైసీపీ అనుబంధ విభాగాల అధ్యక్ష పదవులను భర్తీ చేశారు సీఎం జగన్. మొత్తం 24 విభాగాలకు అధ్యక్షులను నియమించారు. కీలకమైన ఐటీ విభాగానికి పోశింరెడ్డి సునీల్ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. నెల్లూరు జిల్లాకు చెందిన పోశింరెడ్డి సునీల్ కి జగన్ తో వ్యక్తిగతంగా మంచి అనుబంధం ఉంది. ఆ సన్నిహిత సంబంధాల వల్లే జగన్ ఆయనకు ఐటీ వంటి కీలక విభాగాన్ని అప్పగించారని తెలుస్తోంది. సోషల్ మీడియాలోయాక్టివ్ గా ఉంటూ, పార్టీ కార్యకలాపాలలో చురుగ్గా ఉండే సునీల్ ఇప్పుడు రాష్ట్ర వైసీపీ ఐటీ విభాగానికి అధ్యక్షుడిగా వ్యవహరించబోతున్నారు.

మిగతా పదవుల విషయానికొస్తే.. రాష్ట్ర యూత్ వింగ్ అధ్యక్షుడిగా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని నియమించారు సీఎం జగన్. ఆయన ప్రస్తుతం శాప్ చైర్మన్ గా కూడా వ్యవహరిస్తున్నారు. పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కూడా కీలక పదవులు ఇచ్చారు సీఎం జగన్. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న పోతుల సునీతను మహిళా విభాగం అధ్యక్షురాలిగా నియమించారు. వాణిజ్య విభాగం అధ్యక్షుడిగా మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ ని నియమించారు జగన్. స్టేట్ మైనార్టీ సెల్ అధ్యక్షుడిగా మరో ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ని నియమించారు.

స్టేట్ బీసీ సెల్ అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి నియమితులయ్యారు. వైఎస్ఆర్ సేవాదళ్ బాధ్యతలు మరో ఎమ్మెల్సీ మహ్మద్ రాహుల్లాకి అప్పగించారు. వైఎస్సార్ టీచర్స్ ఫెడరేషన్ బాధ్యతలు ఎమ్మెల్సీ కల్పలతా రెడ్డికి, కేంద్ర కార్యాలయ ఇన్ చార్జ్ బాధ్యతలు ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డికి, క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా మరో ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుని నియమించారు జగన్.

ఇక సోషల్ మీడియా విభాగాన్ని నలుగురికి అప్పగించారు. ఎస్టీ సెల్ కి ఇద్దరు, పబ్లిసిటీ వింగ్ కి కూడా ఇద్దరిని అధ్యక్షులుగా నియమించారు. విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా పానుగంటి చైతన్య, రైతు విభాగం అధ్యక్షుడిగా ఎంవీఎస్ నాగిరెడ్డి, వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడిగా గౌతమ్ రెడ్డి, కల్చరల్ వింగ్ అధ్యక్షురాలిగా వంగపండు ఉష, డాక్టర్స్ వింగ్ అధ్యక్షుడిగా పితాని అన్నవరం, ఎన్నారై వింగ్ కి మేడపాటి వెంకట్ ని నియమించారు. మొత్తంగా 24మందికి ఈ పదవులు ఇచ్చారు.

Advertisement

Similar News