ఇది మీకు మీరు తెచ్చుకున్న నిస్తేజం- నేతలతో మంత్రి దాడిశెట్టి
ప్రజా స్పందన చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో వైసీపీకి 175 సీట్లు ఖాయమనిపిస్తోందని శ్రీశైలం వైసీపీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి వ్యాఖ్యానించారు. నియోజకవర్గ ప్లీనరీలో ప్రసంగించిన ఆయన.. వచ్చే ఎన్నికల్లో ఆడవారి ఓట్లు వైసీపీకే పడుతాయన్నారు. మొగుళ్లు వద్దన్నా సరే వారి పెళ్లాలు వైసీపీకి ఓటేస్తారన్నారు. తనకు వచ్చే ఎన్నికల్లో 50వేలకు పైగా మెజారిటీ వస్తుందని చక్రపాణిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు.సంక్షేమ పథకాల అమలులో జగన్ నడి సముద్రంలో చిక్కుకుని ఈదుతున్నారని.. ఆయనకు ప్రజలే అండగా ఉండాలన్నారు. సోషల్ […]
ప్రజా స్పందన చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో వైసీపీకి 175 సీట్లు ఖాయమనిపిస్తోందని శ్రీశైలం వైసీపీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి వ్యాఖ్యానించారు. నియోజకవర్గ ప్లీనరీలో ప్రసంగించిన ఆయన.. వచ్చే ఎన్నికల్లో ఆడవారి ఓట్లు వైసీపీకే పడుతాయన్నారు. మొగుళ్లు వద్దన్నా సరే వారి పెళ్లాలు వైసీపీకి ఓటేస్తారన్నారు. తనకు వచ్చే ఎన్నికల్లో 50వేలకు పైగా మెజారిటీ వస్తుందని చక్రపాణిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు.సంక్షేమ పథకాల అమలులో జగన్ నడి సముద్రంలో చిక్కుకుని ఈదుతున్నారని.. ఆయనకు ప్రజలే అండగా ఉండాలన్నారు. సోషల్ మీడియాలో వైసీపీకి వ్యతిరేకంగా వచ్చే పోస్టుల విషయంలో వైసీపీ కార్యకర్తలు కూడా అంతే స్థాయిలో ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. నవరత్నాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు.
నిస్తేజం మీకు మీరు తెచ్చుకున్నదే- మంత్రి దాడిశెట్టి
తుని వైసీపీ నియోజకవర్గ ప్లీనరీలో మాట్లాడిన మంత్రి దాడిశెట్టి రాజా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు పించన్ ఇచ్చే అధికారం కలెక్టర్‌కు కూడా ఉండేది కాదని, అంతా జన్మభూమి కమిటీదే పెత్తనంగా ఉండేదని, ఇప్పుడు అర్హత ఉన్న వారికి పించన్ రాకుండా అడ్డుకోవడం కలెక్టర్ వల్ల కూడా కాదని, అది జగన్ పరిపాలన తీరు అని వ్యాఖ్యానించారు. వాలంటీర్ల వ్యవస్థ వల్ల తమకు విలువ లేకుండా పోయిందన్న స్థానిక నేతల అసంతృప్తిపై స్పందించిన మంత్రి… ఉదయమే గ్రామాల్లోకి వాలంటీర్లతో పాటు వెళ్లి పించన్ పంచుతామంటే ఎవరైనా అడ్డుకుంటారా అని ప్రశ్నించారు. సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు గ్రామ సచివాలయాల్లో కూర్చుని కంట్రోల్‌లోకి తీసుకుంటే ఎవరైనా వద్దంటారా అని మంత్రి ప్రశ్నించారు. వాళ్లకు అప్పగించాం కదా వాళ్లే చూసుకుంటారులే అన్న నిస్తేజాన్ని తెచ్చుకున్నారని స్థానిక నాయకులను ఉద్దేశించి మంత్రి మాట్లాడారు. చిన్నచిన్న విషయాలను పట్టించుకోవద్దని, కార్యకర్తలు ఎవరూ నిరుత్సాహపడవద్దని… పార్టీని ఎవరైన టచ్ చేస్తే ఊరుకోకూడదని సూచించారు.
ఇక్కడైనా ఎమ్మెల్యేలకు గౌరవం ఇవ్వండి- ఎమ్మెల్యే సోదరుడు
అనంతపురంలో జరిగిన జిల్లా వైసీపీ ప్లీనరీలో రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి సోదరుడు కొన్ని వ్యాఖ్యలు చేశారు. సమావేశం ప్రారంభానికి ముందే కొందరు వైసీపీ నేతలు వెళ్లి వేదికపై ముందు వరుసను ఆక్రయించారు. దాంతో కింద కార్యకర్తల్లో కూర్చున్న ఎమ్మెల్యే సోదరుడు తోపుదుర్తి చంద్రశేఖర్ రెడ్డి… వేదికపై ముందు వరుసలో ఎమ్మెల్యేలు కూర్చునేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. ఎలాగో ప్రభుత్వ కార్యక్రమాల్లో, డీఎస్పీలు, ఆర్డీవోల నియామకం వంటి విషయాల్లో ఎమ్మెల్యేలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని, ఎవరెవరు ఎలా పోస్టింగ్‌లు తెచ్చుకుంటున్నారో తమకు తెలియదని చంద్రశేఖర్ రెడ్డి వ్యాఖ్యానించారు. అసలు ఎమ్మెల్యేలకు ఏం పవరుందని ఆయన ప్రశ్నించారు.