బీజేపీలోకి కొండా విశ్వేశ్వర రెడ్డి…జూలై 1న చేరిక‌ ?

మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి బీజేపీలో చేరడం ఖాయమైనట్టు సమాచారం. ఈ రోజు ఆయనతో బీజేపీ రాష్ట్ర వ్య‌వ‌హారాల ఇంచార్జీ త‌రుణ్ చుగ్‌, పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్‌లు భేటీ అయ్యారు. విశ్వేశ్వర రెడ్డి ఇంట్లోనే జరిగిన ఈ భేటీ దాదాపు గంటకు పైగా జరిగింది. విశ్వేశ్వర రెడ్డిని బీజేపీలో చేరవలసిందిగా త‌రుణ్ చుగ్ ఆహ్వానించగా ఆయన సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. హైదరాబాద్ లో జరగనున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు జూలై […]

Advertisement
Update:2022-06-29 09:38 IST

మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి బీజేపీలో చేరడం ఖాయమైనట్టు సమాచారం. ఈ రోజు ఆయనతో బీజేపీ రాష్ట్ర వ్య‌వ‌హారాల ఇంచార్జీ త‌రుణ్ చుగ్‌, పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్‌లు భేటీ అయ్యారు. విశ్వేశ్వర రెడ్డి ఇంట్లోనే జరిగిన ఈ భేటీ దాదాపు గంటకు పైగా జరిగింది. విశ్వేశ్వర రెడ్డిని బీజేపీలో చేరవలసిందిగా త‌రుణ్ చుగ్ ఆహ్వానించగా ఆయన సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. హైదరాబాద్ లో జరగనున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు జూలై 1 న నగరానికి రానున్న ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా సమక్షంలో విశ్వేశ్వర రెడ్డి బీజేపీలో చేరనున్నట్టు సమాచారం.

తెలంగాణ ఉద్యమకాలం నుంచి విశ్వేశ్వర రెడ్డి రాజకీయాల్లో ఉన్నారు. అంతకు ముందు ఆయన పారిశ్రామికవేత్తగానే కాక సామాజిక కార్యక్రమాల ద్వారా ప్రాచుర్యం పొందారు. మొదట టీఆరెస్ ద్వారా ఎంపీగా గెల్చిన ఆయన అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ లో చేరారు. అయితే కాంగ్రెస్ లో సాగే గ్రూపు రాజకీయాలతో విసిగి పోయి ఆయన ఆ పార్టీకి రాజీనామా చేశారు. సంవత్సరకాలంగా ఆయన ఏ పార్టీలోనూ చేరలేదు. అయితే బీజేపీ లో చేరతాడనే వార్తలు మాత్రం చాలా కాలంగా వినిపిస్తున్నాయి.

విశ్వేశ్వర రెడ్డి తరుణ్ చుగ్ తో జరిగిన సమావేశంలో పార్టీలో తనకిచ్చే ప్రాధాన్యత గురించే ప్రధానంగా చర్చించినట్టు తెలుస్తోంది. ఆయనకు ఒక‌ ముఖ్యమైన పదవి ఇస్తామని, ఎంపీ సీటు కూడా కేటాయిస్తామని తరుణ్ చుగ్ హామీ ఇచ్చిన అనంతరం ఆయన బీజేపీలో చేరేందుకు ఒప్పుకున్నారు.

Tags:    
Advertisement

Similar News