నత్తోడు పాదయాత్ర చేసినా.. తిక్కలోడు బస్ యాత్ర చేసినా..

వైసీపీ ప్లీనరీ సమావేశాల్లో టీడీపీపై విరుచుకుపడుతున్నారు నేతలు. తాజాగా సత్యసాయి జిల్లాలో జరిగిన ప్లీనరీ సమావేశంలో.. హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నత్తోడు లోకేష్ పాదయాత్ర చేసినా, తిక్కలోడు పవన్ కళ్యాణ్ బస్ యాత్ర చేసినా, ముసలోడు చంద్రబాబు కాశీ యాత్ర చేసినా జగన్ జైత్ర యాత్రను ఎవరూ ఆపలేరని చెప్పారాయన. స్కూల్ లీడర్ గా కూడా గెలవలేని లోకేష్ ని, వార్డు మెంబర్ గా కూడా గెలవలేని లోకేష్ ని, మంత్రిని […]

Advertisement
Update:2022-06-29 02:46 IST

వైసీపీ ప్లీనరీ సమావేశాల్లో టీడీపీపై విరుచుకుపడుతున్నారు నేతలు. తాజాగా సత్యసాయి జిల్లాలో జరిగిన ప్లీనరీ సమావేశంలో.. హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నత్తోడు లోకేష్ పాదయాత్ర చేసినా, తిక్కలోడు పవన్ కళ్యాణ్ బస్ యాత్ర చేసినా, ముసలోడు చంద్రబాబు కాశీ యాత్ర చేసినా జగన్ జైత్ర యాత్రను ఎవరూ ఆపలేరని చెప్పారాయన. స్కూల్ లీడర్ గా కూడా గెలవలేని లోకేష్ ని, వార్డు మెంబర్ గా కూడా గెలవలేని లోకేష్ ని, మంత్రిని చేస్తే మంగళగిరి ప్రజలు వంగబెట్టి ఓడించారని మండిపడ్డారు.

పాపాలన్నీ గోచిలో పెట్టుకుని..
చంద్రబాబు గాలి సోకి పైరు చెడిపోతే ఆ నష్టానికి కూడా ఇన్సూరెన్స్ ఇచ్చిన గొప్ప వ్యక్తి సీఎం జగన్ అని కొనియాడారు ఎంపీ గోరంట్ల మాధవ్. 2014లో చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే వానదేవుడు పారిపోయాడని, పశువులకు మేత దొరకక కబేళాకు పోయాయని, అన్నం పెట్టే రైతన్న వలసపోయాడని ఎద్దేవా చేశారు. రైతులను తుపాకులతో కాల్పించిన నికృష్టపు చరిత్ర చంద్రబాబుదని మండిపడ్డారు. వైసీపీ వైపు సంక్షేమ పథకాలు, సామాజిక న్యాయం, ప్రజలు, నీతి, నిజాయితీ వంటివన్నీ ఉన్నాయని, టీడీపీ వైపు మాత్రం.. తాగుబోతు, లఫంగి, దున్నపోతు లాంటి వాళ్లు.. అయ్యన్న, అచ్చెన్న, చింతమనేని, పట్టాభి ఉన్నారని విమర్శించారు. అలాంటి వాళ్లను వెనకేసుకొని చేసిన పాపాలను గోచిలో పెట్టుకొని కాశీకి పోయినా ప్రజలు చంద్రబాబును నమ్మి ఓట్లు వేసే పరిస్థితి లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో వైసీపీదే విజయం అని అన్నారు గోరంట్ల మాధవ్.

బటన్ నొక్కి డబ్బులేశాం, బటన్ నొక్కి వైసీపీని గెలిపించండి..
పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపిన ఘనత సీఎం జగన్ కే దక్కుతుందన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ప్లీనరీలో పాల్గొన్న ఆయన.. జగన్ పాలనలో అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. సచివాలయాలు ఏర్పాటు చేసి 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చి దేశంలోనే ఆదర్శవంతమైన సీఎంగా జగన్ పేరు తెచ్చుకున్నారని చెప్పారు. వైసీపీ హయాంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, పొరపాటున టీడీపీ హయాంలో ఉండి ఉంటే సగం సొమ్ము పచ్చ చొక్కా నేతల జేబుల్లోకి వెళ్లిపోయేదని చెప్పారు. అవినీతి, అక్రమాలకు తావు లేకుండా ఒక్క బటన్ నొక్కి పేదల ఖాతాల్లోకి జగన్ నగదు జమ చేస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో ప్రజలంతా ఫ్యాన్ గుర్తుపై బటన్ నొక్కి 175 స్థానాలు ఇవ్వాలని కోరారు.

Tags:    
Advertisement

Similar News