గర్భవతులపై వాయుకాలుష్య ప్రభావం.. పిల్లల్లో జ్ఞాపకశక్తి మందగమనం

వాయు కాలుష్యం పిల్లల మానసిక ఎదుగుదలను ప్రభావితం చేస్తుందని, అయితే ఆ ప్రభావం తీవ్ర స్థాయిలో ఉండే అవకాశం కూడా ఉందని సర్వేలు చెబుతున్నాయి. పిల్లలు పుట్టిన తర్వాత వారిపై కాలుష్య ప్రభావం ఉంటుందని అనుకోవడం పొరపాటని, గర్భంలో ఉన్నప్పుడు కూడా వారు కాలుష్య ప్రభావానికి గురవుతారని చెబుతున్నారు పరిశోధకులు.

Advertisement
Update:2022-07-28 11:50 IST

వాయు కాలుష్యం పిల్లల మానసిక ఎదుగుదలను ప్రభావితం చేస్తుందని, అయితే ఆ ప్రభావం తీవ్ర స్థాయిలో ఉండే అవకాశం కూడా ఉందని సర్వేలు చెబుతున్నాయి. పిల్లలు పుట్టిన తర్వాత వారిపై కాలుష్య ప్రభావం ఉంటుందని అనుకోవడం పొరపాటని, గర్భంలో ఉన్నప్పుడు కూడా వారు కాలుష్య ప్రభావానికి గురవుతారని చెబుతున్నారు పరిశోధకులు. గాలి కాలుష్యం పిల్లల మెదడు అభివృద్ధిపై ప్రభావం చూపుతుందని సైమన్ ఫ్రేజర్ విశ్వవిద్యాలయం, మంగోలియన్ శాస్త్రవేత్తల సంయుక్త అధ్యయనం తేల్చింది.


ఎయిర్ ఫిల్టర్ల వాడకంతో చెక్..


గర్భవతులు వాయు కాలుష్య ప్రభావానికి లోను కాకుండా చేసేందుకు ఈ పరిశోధనలో ఎయిర్ ఫిల్టర్లను వాడారు. 540మంది గర్భిణి స్త్రీలపై ఈ పరిశోధన జరిగింది. ధూమపానం అలవాటు ఉన్నవారితోపాటు మరికొందరు మహిళలను ఒక సమూహంగా ఏర్పాటు చేశారు. మరికొందరిని రెండో సమూహంగా ఏర్పాటు చేసి వారికి ఎయిర్ ఫిల్టర్లను వాడాలని సూచించారు. బిడ్డ పుట్టేవరకు రెండో సమూహం ఎయిర్ ఫిల్టర్లను వాడింది. మొదటి సమూహంలోనివారు మాత్రం సాధారణ వాతావరణంలోనే ఉన్నారు.


బిడ్డల మానసిక ఎదుగుదల ఇలా..



బిడ్డల మానసిక ఎదుగుదలను అంచనా వేయాలంటే వారికి కనీసం ఐదేళ్లు వచ్చే వరకు వేచి చూడాలి. ఈ పరిశోధన కూడా ఐదేళ్లపాటు కొనసాగింది. బిడ్డలు పుట్టిన తర్వాత రెండో సమూహం మహిళలు ఎయిర్ ఫిల్టర్లను తొలగించారు. పిల్లలు కూడా సాధారణ వాతావరణ పరిస్థితులలోనే పెరిగారు.


నాలుగేళ్లు నిండిన తర్వాత వెచ్లర్ ప్రీస్కూల్, ప్రైమరీ స్కేల్ ఆఫ్ ఇంటెలిజెన్స్‌ టెస్ట్ ద్వారా వారిలోని సామర్థ్యాలను వెలికి తీశారు. గర్భిణిలుగా ఉన్నప్పుడు ఎయిర్ క్లీనర్ లు ఉపయోగించిన మహిళలకు పుట్టిన సంతానం, ఎయిర్ క్లీనర్ లు ఉపయెగించని మహిళలకు పుట్టిన సంతానం కంటే.. సగటున 2.8 పాయింట్ల ఐక్యూ ఎక్కువగా పొందినట్టు తేలింది.


అంటే పిల్లలు పుట్టిన తర్వాత కంటే.. గర్భంలో ఉన్నప్పుడు తల్లి ఎక్కువ జాగ్రత్తగా ఉండాలని, గర్భిణిగా ఉన్నప్పుడు తల్లి వాయు కాలుష్యానికి గురైతే.. పిల్లల మానసిక ఎదుగుదలపై అది గట్టి ప్రభావం చూపిస్తుందని తేలింది.

Tags:    
Advertisement

Similar News