జూలై 4 వరకు ట్విట్టర్‌కు కేంద్రం డెడ్‌లైన్

ప్రముఖ మైక్రో బ్లాగింగ్, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌కు కేంద్ర ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది. జూలై 4లోపు తాము ఇప్పటి వరకు ఇచ్చిన అన్ని ఆదేశాలను పాటించాలని తుది గడువు విధించింది. అలా చేయకపోతే.. ఇప్పటి వరకు ‘మధ్యవర్తి’ అని ఉన్న స్టేటస్‌ను రద్దు చేస్తామని.. ఇకపై అందులో చేసే ట్వీట్లు, కామెంట్లకు ట్విట్టర్ బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఈ మేరకు మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ డిపార్ట్‌మెంట్ ఇప్పటికే నోటీసులు జారీ […]

Advertisement
Update:2022-06-29 12:02 IST

ప్రముఖ మైక్రో బ్లాగింగ్, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌కు కేంద్ర ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది. జూలై 4లోపు తాము ఇప్పటి వరకు ఇచ్చిన అన్ని ఆదేశాలను పాటించాలని తుది గడువు విధించింది. అలా చేయకపోతే.. ఇప్పటి వరకు ‘మధ్యవర్తి’ అని ఉన్న స్టేటస్‌ను రద్దు చేస్తామని.. ఇకపై అందులో చేసే ట్వీట్లు, కామెంట్లకు ట్విట్టర్ బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఈ మేరకు మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ డిపార్ట్‌మెంట్ ఇప్పటికే నోటీసులు జారీ చేసింది.

జూన్ 27న ఐటీ శాఖ ట్విట్టర్‌కు తుది నోటీసు పంపించింది. ‘గతంలో తాము ఇచ్చిన ఆదేశాల్లో చాలా వాటిని ఇంత వరకు అమలు చేయలేదు ఈ నెల మొదట్లో నోటీసు ఇచ్చినా సరైన స్పందన రాలేదు. ఇదే చిట్టచివరి నోటీసు’ అని అందులో పేర్కొన్నది. అయితే ఈ నోటీసుపై ట్విట్టర్ ఇండియా ఇంత వరకు స్పందించలేదు.

ట్విట్టర్‌కు సంబంధించిన కొన్ని అకౌంట్లు, ట్వీట్లను తొలగించాలని గతంలో కేంద్రం కోరింది. ఇందులో అంతర్జాతీయ న్యాయవాద గ్రూప్ ఫ్రీడమ్ హౌస్, జర్నలిస్టులు, రాజకీయ నాయకులు, రైతుల నిరసనలకు సంబంధించిన అకౌంట్లు ఉన్నాయి. కేంద్రం ఆదేశాల మేరకు తాము బ్లాక్ చేసిన 80కి పైగా ట్విట్టర్ అకౌంట్లు, ట్వీట్ల జాబితాను ఈ నెల 26న కేంద్రానికి అందించింది.

అయితే, తాము గతంలో ఇచ్చిన అనేక ఆదేశాలను పాటించలేదని.. వాటన్నింటిని కూడా జూలై 4లోగా అమలు చేయాలని చివరి నోటీసు ఇచ్చింది.

Tags:    
Advertisement

Similar News