మోడీని రాజ్‌భవన్‌లో ఉంచడం సేఫ్ కాదు : తెలంగాణ పోలీస్

ప్రధాని నరేంద్ర మోడీ మరో నాలుగు రోజుల్లో హైదరాబాద్ రానున్నారు. జూలై 2న హెచ్‌ఐసీసీలో నిర్వహించే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొంటారు. ఆ తర్వాతి రోజు పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. రెండు రోజుల పాటు దేశ ప్రధాని నగరంలోనే ఉండనుండటంతో ఇప్పటికే ఆయనకు రక్షణ కల్పించే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ) నగరానికి చేరుకుంది. తెలంగాణ పోలీసులతో సమన్వయం చేసుకుంటూ మోడీ సెక్యూరిటీని పర్యవేక్షించనుంది. కాగా, జూలై 2వ తేదీ […]

Advertisement
Update:2022-06-28 04:49 IST

ప్రధాని నరేంద్ర మోడీ మరో నాలుగు రోజుల్లో హైదరాబాద్ రానున్నారు. జూలై 2న హెచ్‌ఐసీసీలో నిర్వహించే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొంటారు. ఆ తర్వాతి రోజు పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.

రెండు రోజుల పాటు దేశ ప్రధాని నగరంలోనే ఉండనుండటంతో ఇప్పటికే ఆయనకు రక్షణ కల్పించే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ) నగరానికి చేరుకుంది. తెలంగాణ పోలీసులతో సమన్వయం చేసుకుంటూ మోడీ సెక్యూరిటీని పర్యవేక్షించనుంది.

కాగా, జూలై 2వ తేదీ రాత్రి ఆయన ఎక్కడ బస చేయాలనే విషయంపై సందిగ్దత నెలకొంది. మోడీని రాజ్ భవన్‌లో ఉంచాలని ఎస్పీజీ భావించింది. అయితే అది అంత సేఫ్ కాదని తెలంగాణ పోలీసులు చెప్పినట్లు తెలుస్తుంది.

ఇటీవల రాజ్‌భవన్ పరిసరాల్లో పలు పార్టీల నేతలు తీవ్ర నిరసనలు వ్యక్తం చేసిన విషయాన్ని గుర్తుచేశారు. అలాగే యాంటీ-అగ్నిపథ్ ఆందోళనకారులు సికింద్రబాద్ రైల్వే స్టేషన్‌లో చేసిన విధ్వంసం ఇంకా మర్చిపోలేదు. ప్రధాని రాజ్‌భవన్‌లో ఉన్నారని తెలిస్తే.. నిరసన, ఆందోళనకారులు అక్కడకు చేరుకునే అవకాశం ఉందని, చుట్టుపక్కల అంతా బిజీ ట్రాఫిక్ ఉండే రోడ్లు కూడా కావడంతో రాజ్ భవన్ బదులు వేరే చోట ప్రధాని బసను ఏర్పాటు చేయాలని తెలంగాణ పోలీస్ సూచించారు.

కాగా, హెచ్ఐసీసీ ప్రాంగణాన్ని అనుకొని అత్యంత విలాసవంతమైన నోవోటెల్ హోటల్ ఉంది. అక్కడ బస చేస్తే రక్షణ కల్పించడం కూడా సులువుగా ఉంటుందని ఎస్పీజీకి తెలంగాణ పోలీసులు సూచించినట్లు తెలుస్తుంది. అయితే ప్రధాని బసపై చివరి నిర్ణయం తీసుకోవల్సింది ఎస్పీజీనే అని.. తెలంగాణ పోలీస్ కేవలం వారికి సహాయంగా మాత్రమే ఉంటుందని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. కాగా, జూలై 2న హైదరాబాద్ చేరుకున్న వెంటనే పీఎం మోడీ.. రాజ్‌భవన్‌కు వెళ్లనున్నట్లు సమాచారం.

ఇక జూలై 2న నిర్వహించనున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశానికి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి బీజేపీ కార్యకర్తలు, నాయకులు హాజరుకానున్నారు. 3న జరిగే బహిరంగ సభకు కూడా చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి.

10వేల మంది ఇతర రాష్ట్రాల బీజేపీ కార్యకర్త‌లు హాజరుకానున్నట్లు తెలుస్తుంది. ఆ సభ నుంచే తెలంగాణలో ఎన్నికల శంఖారావాన్ని పూరించాలని బీజేపీ భావిస్తుంది. రాష్ట్రంలోని ప్రతీ పోలింగ్ బూత్ నుంచి ఒకరిద్దరు సభకు వచ్చేలా ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. ఇక హైదరాబాద్‌కు సమీపంలోని ఒక్కో నియోజకవర్గం నుంచి 1000 మందిని సమీకరించనున్నారు.

Tags:    
Advertisement

Similar News