విద్యకు దూరం కావద్దనే అమ్మఒడి..సీఎం జగన్.
ప్రతి ఒక్కరికి చదువే నిజమైన ఆస్తి అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలోని ఏ పేద విద్యార్థి కూడా విద్యకు దూరం కావొద్దనే ఉద్దేశ్యంతో అమ్మఒడి స్కీంను తీసుకొచ్చామని చెప్పారు. ఈ పథకం ద్వారా దాదాపు 80 లక్షల మంది విద్యార్థుల తల్లులకు లబ్ధి చేకూరుతోందని చెప్పారు. సోమవారం ఆయన శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని కోడి రామ్మూర్తి మైదానంలో బహిరంగ సభలో ప్రసంగించారు. అమ్మఒడి లబ్ధిదారులకు బటన్ నొక్కి నగదు జమ చేశారు. అనంతరం […]
ప్రతి ఒక్కరికి చదువే నిజమైన ఆస్తి అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలోని ఏ పేద విద్యార్థి కూడా విద్యకు దూరం కావొద్దనే ఉద్దేశ్యంతో అమ్మఒడి స్కీంను తీసుకొచ్చామని చెప్పారు.
ఈ పథకం ద్వారా దాదాపు 80 లక్షల మంది విద్యార్థుల తల్లులకు లబ్ధి చేకూరుతోందని చెప్పారు. సోమవారం ఆయన శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని కోడి రామ్మూర్తి మైదానంలో బహిరంగ సభలో ప్రసంగించారు. అమ్మఒడి లబ్ధిదారులకు బటన్ నొక్కి నగదు జమ చేశారు.
అనంతరం సీఎం మాట్లాడుతూ.. ‘ప్రతి పేద తల్లి తన పిల్లాడికి మెరుగైన విద్య అందించాలన్నదే ప్రభుత్వ ధ్యేయం. అందుకే 75 శాతం హాజరు తప్పనిసరి చేశాం. పాఠశాలలు అభివృద్ధి చేయాలన్నదే మా ప్రభుత్వ ధ్యేయం. అక్కడి విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పిస్తున్నాం. ఉచితంగా నాణ్యమైన ఇంగ్లిష్ మీడియం విద్యను అందజేస్తున్నాం.
పాఠశాలల్లో టాయిలెట్ మెయింటనెన్స్ కోసం రూ. 2000 తీసుకుంటున్నాం. దీనిపై కొందరు అనవసర విమర్శలు చేస్తున్నారు. జగనన్న అమ్మఒడి స్కీం కింద ఇప్పటివరకు 19,618 కోట్లు పేద తల్లుల ఖాతాలో జమచేశాం.’ అని సీఎం జగన్ పేర్కొన్నారు. అమ్మఒడి పథకంపై దేశవ్యాప్తంగా ప్రశంసలు దక్కుతున్నాయని ఆయన చెప్పారు.