ఫాస్టాగ్‌లో డబ్బులు స్మార్ట్ వాచ్‌తో కొట్టేయడం సాధ్యమా?

హైవేలపై ప్రయాణించే సమయంలో టోల్ ప్లాజాల వద్ద ఆటోమెటిక్‌గా డిజిటల్ పద్దతిలో సొమ్ము చెల్లించడానికి ‘ఫాస్టాగ్’ (FAStag) అనే పద్దతిని తీసుకొని వచ్చారు. టోల్ ప్లాజా దగ్గరకు మన వాహనం వెళ్లగానే విండ్ షీల్డ్‌పై ఉండే ఫాస్టాగ్ ద్వారా మన బ్యాంకు ఖాతా నుంచి మనీ కట్ అయిపోయి, ఎదురుగా ఉండే గేట్లు తెరుచుకుంటాయి. చిల్లర కోసం వెతుక్కోవడం, భారీ క్యూలు ఉండక పోవడంతో ప్రయాణం సులువుగా మారిపోయింది. దేశవ్యాప్తంగా ఇప్పడు ఫాస్టాగ్ తప్పనిసరి చేయడంతో అందరూ […]

Advertisement
Update:2022-06-25 12:51 IST

హైవేలపై ప్రయాణించే సమయంలో టోల్ ప్లాజాల వద్ద ఆటోమెటిక్‌గా డిజిటల్ పద్దతిలో సొమ్ము చెల్లించడానికి ‘ఫాస్టాగ్’ (FAStag) అనే పద్దతిని తీసుకొని వచ్చారు. టోల్ ప్లాజా దగ్గరకు మన వాహనం వెళ్లగానే విండ్ షీల్డ్‌పై ఉండే ఫాస్టాగ్ ద్వారా మన బ్యాంకు ఖాతా నుంచి మనీ కట్ అయిపోయి, ఎదురుగా ఉండే గేట్లు తెరుచుకుంటాయి. చిల్లర కోసం వెతుక్కోవడం, భారీ క్యూలు ఉండక పోవడంతో ప్రయాణం సులువుగా మారిపోయింది. దేశవ్యాప్తంగా ఇప్పడు ఫాస్టాగ్ తప్పనిసరి చేయడంతో అందరూ దీన్ని వినియోగిస్తున్నారు.

సైబర్ నేరాలు పెరిగిపోతున్న క్రమంలో ఫాస్టాగ్‌ను హ్యాక్ చేసి ఎవరైనా మన ఖాతాలో సొమ్ము కాజేస్తే? డిజిటల్ పరికరాల ద్వారా ఫాస్టాగ్‌ను స్కాన్ చేసి డబ్బులు దొంగిలిస్తే? ఇలాంటి అనుమానాలు అందరికీ ఉన్నాయి. దీనికి తోడు ఇటీవల సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో చక్కర్లు కొడుతున్నది. ఒక సిగ్నల్ దగ్గర ఆగిన కారు అద్దాన్ని తుడవడానికి అబ్బాయి వస్తాడు. తుడుస్తూనే తన చేతికి ఉన్న స్మార్ట్ వాచ్‌తో ఫాస్టాగ్‌ను స్కాన్ చేయడానికి ప్రయత్నిస్తాడు. కారులో ఉన్నవాళ్లు ఆ అబ్బాయిని పిలిచి డబ్బులు వద్దా.. అలా తుడిచి వెళ్లిపోతున్నావు అని అడుగుతారు. నీ చేతికి ఉన్నది స్మార్ట్ వాచేనా అని అడుగుతారు. దీంతో ఆ అబ్బాయి భయపడి అక్కడి నుంచి పారిపోతాడు. ఈ వీడియోను విస్తృతంగా వైరల్ చేసి ఫాస్టాగ్ ద్వారా డబ్బులు కొట్టేస్తున్నారంటూ విపరీతంగా ప్రచారం చేస్తున్నారు.

అయితే ఇదంతా ఫేక్ అని, ఫాస్టాగ్ నుంచి అంత సులభంగా డబ్బులు కొట్టేయడం జరగదని అంటున్నారు. ఎథికల్ హ్యాకర్ సన్నీ నెహ్రా ఫాస్టాగ్ పని తీరును పూర్తిగా వివరించారు. ఫాస్టాగ్ మొత్తం ఒక ఇన్‌బిల్ట్ మెకానిజం ద్వారా పని చేస్తుందని పేర్కొన్నారు. ఆయన ఏం చెప్పారంటే..

ప్రతీ టోల్ ప్లాజాకు ఒక యునీక్ కోడ్ ఉంటుంది. అలాగే అన్ని టోల్ ప్లాజాలు ఏదో ఒక బ్యాంక్‌తో అనుసంధానం అయి ఉంటాయి. దీన్నే నాపర్ అక్వైరర్ బ్యాంక్ అంటారు. యునీక్ కోడ్-అక్వైరర్ బ్యాంక్‌ కాంబినేషన్ నేషనల్ ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ (ఎన్ఈటీసీ) సిస్టమ్‌కు అనుసంధానమై ఉంటుంది. ఎన్ఈటీసీ అనుబంధ టోల్ ప్లాజాల దగ్గర ఫాస్టాగ్ ఆర్ఎఫ్ఐడీ (రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్) స్కాన్ అయి మన బ్యాంకు నుంచి డబ్బులు కట్ అవుతాయి.

అయితే ఇది ఎక్కడ పడితే అక్కడ స్కాన్ అయ్యే వీలు ఉండదు. సదరు టోల్ ప్లాజా జియో లొకేషన్ లోనే స్కాన్ అవుతుంది. ఉదాహరణకు.. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తుంటే పంతంగి దగ్గర టోల్ ప్లాజా ఉంది. అక్కడకు వెళ్లగానే ఫాస్టాగ్‌ నుంచి డబ్బులు కట్ అవుతాయి. అదే పంతంగి ప్లాజాలో ఉపయోగించే స్కానర్ వేరే ప్రదేశంలోకి తీసుకొని వెళ్తే పని చేయవు. ఆ ప్లాజా స్కానర్ వివరాలు దొంగిలించి.. బయట కార్ల నుంచి డబ్బులు కొట్టేయాలన్నా కుదరదు. ఎందుకంటే జియో లొకేషన్ (నిర్థిష్ట ప్రాంతం)లోనే ఆ స్కానర్ పని చేస్తుంది.

ఒక ఫాస్టాగ్ పని చేయాలంటే టోల్ ప్లాజా యునీక్ కోడ్, అక్వైరర్ బ్యాంక్ డీటైల్స్, ఎన్‌ఈటీసీ సిస్టమ్, జియో లొకేషన్ అన్నీ మ్యాచ్ అయితేనే డబ్బులు డ్రా అవుతాయి. ఇన్ని కాంబినేషన్లను ఒకే సారి కలిపి కేవలం ఒక స్మార్ట్ వాచ్ ద్వారా కొట్టేయడం కష్టమని సన్నీ నెహ్రా చెప్తున్నారు. ఇక పేటీఎం ఫాస్టాగ్ గురించి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో పూర్తిగా ఫేక్ అని స్పష్టం చేస్తున్నారు. స్మార్ట్ వాచెస్‌కు ఫాస్టాగ్‌ను స్కాన్ చేసే అంత టెక్నాలజీ లేదని అంటున్నారు.

Tags:    
Advertisement

Similar News