బంగ్లాలో హిందువులకు అక్కడి ప్రభుత్వం భద్రత కల్పించాలే

పార్లమెంట్‌లో కేంద్ర మంత్రి కీర్తివర్ధన్‌ సింగ్‌

Advertisement
Update:2024-11-28 18:30 IST

బంగ్లాదేశ్‌లో కొంత కాలంగా హిందువులపై దాడులు జరుగుతున్నాయని, ఆ దాడుల నుంచి మైనార్టీలుగా ఉన్న హిందువులకు భద్రత కల్పించాల్సింది అక్కడి ప్రభుత్వమేనని కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్‌ సింగ్‌ అన్నారు. బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతోన్న వరుస దాడులపై గురువారం ఆయన లోక్‌సభలో స్పందించారు. ఆందోళనకారులు హిందువులను టార్గెట్‌ చేసి దాడులు చేస్తున్నారని, ఆలయాలపైనా దాడులు కొనసాగుతున్నాయని తెలిపారు. ఢాకాలోని తంతిబజార్‌లో ఆలయంపై, జేశోరేశ్వరి కాళీమాత ఆలయంలో కిరీటం చోరీపై తమ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసిందన్నారు. మైనార్టీలైన హిందువులకు భద్రత కల్పించాలని ఇప్పటికే ఆ దేశ ప్రభుత్వాన్ని కోరామని చెప్పారు. బంగ్లాదేశ్‌ జెండాను అగౌరవించారని ఆరోపిస్తూ ఇస్కాన్‌ ప్రతినిధి చిన్మయ్‌ కృష్ణాదాస్‌ అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. చిన్మయ్‌ అరెస్టుకు వ్యతిరేకంగా బంగ్లాదేశ్‌ లో హిందువులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. బంగ్లాదేశ్‌లో చోటు చేసుకుంటున్న పరిణామాలపై కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌ ప్రధాని మోదీతో గురువారం ప్రత్యేకంగా సమావేశమైనట్టు తెలుస్తోంది. శుక్రవారం పార్లమెంట్‌లో బంగ్లాదేశ్‌లో పరిస్థితిపై కేంద్ర మంత్రి జైశంకర్‌ ప్రకటన చేసే అవకాశముందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి.

Tags:    
Advertisement

Similar News