అభివృద్ధి నా కులం, సంక్షేమం నా మతం -కేటీఆర్

కులం, మతం గురించి తనకు తెలియదని.. అభివృద్ధి తన కులం, సంక్షేమం తన మతం అని చెప్పారు మంత్రి కేటీఆర్. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలో నూతనంగా నిర్మిస్తున్న జిల్లా రెడ్డి సంఘం భవనానికి భూమిపూజ చేశారు కేటీఆర్. రెడ్డి సంఘం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటుకి కృషి చేస్తానని, వారి డిమాండ్ ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానన్నారు. వైశ్య, రెడ్డి కార్పొరేషన్ల ఏర్పాటు త్వరలోనే సాధ్యమవుతుందని […]

Advertisement
Update:2022-06-24 15:08 IST

కులం, మతం గురించి తనకు తెలియదని.. అభివృద్ధి తన కులం, సంక్షేమం తన మతం అని చెప్పారు మంత్రి కేటీఆర్. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలో నూతనంగా నిర్మిస్తున్న జిల్లా రెడ్డి సంఘం భవనానికి భూమిపూజ చేశారు కేటీఆర్. రెడ్డి సంఘం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటుకి కృషి చేస్తానని, వారి డిమాండ్ ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానన్నారు. వైశ్య, రెడ్డి కార్పొరేషన్ల ఏర్పాటు త్వరలోనే సాధ్యమవుతుందని ఆయన హామీ ఇచ్చారు. ప్రతి కులంలో డబ్బున్నవారు, డబ్బులేనివారు ఉన్నారని, పేదవారు ఏ కులంలో ఉన్నవారైనా, వారికి న్యాయం చేస్తామని స్పష్టం చేశారు.

75 ఏళ్ల స్వతంత్ర భార‌త‌దేశంలో జ‌ర‌గ‌ని అభివృద్ధి, ప్ర‌త్యేక రాష్ట్రం ఏర్ప‌డిన త‌ర్వాత తెలంగాణలో సాధ్య‌మైంద‌న్నారు కేటీఆర్. కేసీఆర్ రైతుబిడ్డ కాబ‌ట్టే రైతుల సంక్షేమం కోసం పాటుప‌డుతున్నార‌ని చెప్పారు. ఈ నెల 28 నుంచి రైతుబంధు నిధులు రైతుల ఖాతాల్లో జ‌మ అవుతాయని స్పష్టం చేశారు. సిరిసిల్ల‌లో మెడిక‌ల్ కాలేజీ నిర్మించుకోబోతున్నామ‌ని చెప్పారు కేటీఆర్. సిరిసిల్ల ప్రజల ఆశీర్వాదంతో త‌న‌కు మంత్రి పదవి వచ్చిందని, త‌న ఒంట్లో శ‌క్తి ఉన్నంత వ‌ర‌కు ప్ర‌జ‌ల‌ సంక్షేమానికి కృషిచేస్తాన‌ని అన్నారు కేటీఆర్.

తెలంగాణలో రైతు ఏ కారణంతో చనిపోయినా, ఆ కుటుంబానికి ధీమా నిచ్చేవిధంగా రూ.5 లక్షల బీమా వస్తుందని చెప్పారు కేటీఆర్. ప్రభుత్వ ప్రణాళికతో రాజన్న సిరిసిల్ల జిల్లాలో 6 మీటర్ల మేర భూగ‌ర్భ జ‌లాలు పెరిగాయ‌ని, ఈ విజయాన్ని ముస్సోరిలో ఐఏఎస్ లకు పాఠ్యాంశంగా చేర్చారని గుర్తుచేశారు. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా జిల్లాలో తంగళ్ళపల్లి మండలంలో వ్యవసాయ కళాశాల నిర్మించుకున్నామని అన్నారు కేటీఆర్.

Tags:    
Advertisement

Similar News