ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ
కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్ కు ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి
Advertisement
ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు బుధవారం సాయంత్రం ప్రధాని నరేంద్రమోదీతో మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. గంటకు పైగా సాగిన ఈ సమావేశంలో కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్ కు ప్రాధాన్యత ఇవ్వాలని ఈ సందర్భంగా ప్రధానిని చంద్రబాబు అభ్యర్థించారు. పోలవరం ప్రాజెక్టుకు నిధుల కేటాయింపుతో పాటు ఏపీ అభివృద్ధికి అధిక నిధులు కేటాయించాలని కోరారు. ఆరు నెలల కూటమి ప్రభుత్వ ప్రోగ్రెస్ రిపోర్టును ప్రధానికి వివరించారు. చంద్రబాబు విజ్ఞప్తులకు ప్రధాని సానుకూలంగా స్పందించారని సమాచారం. చంద్రబాబు ఈ రోజు రాత్రి కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో పాటు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తోనూ భేటీ కానున్నారు.
Advertisement