చైనా ఉత్పత్తులను బహిష్కరించమనేదీ మీరే, ఆ దేశం నుండి దిగుమతులు పెంచేదీ మీరే

భారత్, చైనా సరిహద్దుల్లో ప్రతి రోజూ ఉద్రిక్తలు పెరుగుతూనే ఉంటాయి. ఆ దేశంతో ఘర్షణలు జరుగుతూనే ఉంటాయి. ఘర్షణలు జరిగి మన సైనికులు మరణించినప్పుడు ప్రభుత్వం కొన్ని చైనా యాప్ లను బ్యాన్ చేస్తుంది…చైనా ఉత్పత్తులు బహిష్కరించాలని బీజేపీ నాయకులు పిలుపు ఇస్తూ ఉంటారు. సోషల్ మీడియాలో ‘బ్యాన్ చైనా ప్రొడక్ట్స్ ‘ అని ఉద్యమం నడుస్తుంది. కానీ బీజేపీ ప్రభుత్వ ఆచరణ మాత్రం పూర్తిగా అందుకు విరుద్దంగా ఉంటుంది. భారత్ కు చైనా దిగుమతులు 2020-21 […]

Advertisement
Update:2022-06-24 06:58 IST

భారత్, చైనా సరిహద్దుల్లో ప్రతి రోజూ ఉద్రిక్తలు పెరుగుతూనే ఉంటాయి. ఆ దేశంతో ఘర్షణలు జరుగుతూనే ఉంటాయి. ఘర్షణలు జరిగి మన సైనికులు మరణించినప్పుడు ప్రభుత్వం కొన్ని చైనా యాప్ లను బ్యాన్ చేస్తుంది…చైనా ఉత్పత్తులు బహిష్కరించాలని బీజేపీ నాయకులు పిలుపు ఇస్తూ ఉంటారు. సోషల్ మీడియాలో ‘బ్యాన్ చైనా ప్రొడక్ట్స్ ‘ అని ఉద్యమం నడుస్తుంది. కానీ బీజేపీ ప్రభుత్వ ఆచరణ మాత్రం పూర్తిగా అందుకు విరుద్దంగా ఉంటుంది.

భారత్ కు చైనా దిగుమతులు 2020-21 ఆర్థిక సంవత్సరంలో 4.82 ట్రిలియన్ డాలర్లుండగా, అదే 2021- 22 సంవత్సరంలో 45.51% పెరిగి రూ.7.02 ట్రిలియన్లకు చేరుకున్నాయి. ఇవి స్వయంగా కేంద్ర వాణిజ్య శాఖ వెల్లడించిన లెక్కలే.

చైనా నుండి ఖనిజ ఇంధనాలు, నూనెలు, రసాయనాలు, ఎరువులు, ప్లాస్టిక్, ఇనుము, ఉక్కు, విద్యుత్ యంత్రాలు, పరికరాలు, వైద్య పరికరాలు మనం అత్యధికంగా దిగుమతి చేసుకుంటున్నాం.

ఈ విధంగా చైనా నుంచి దిగుమతులు గణనీయంగా పెరగడంపై నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ ప్రొఫెసర్ లేఖా ఎస్ చక్రవర్తి మాట్లాడుతూ, “ద్వైపాక్షిక రాజకీయ ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ 2021-22 ఆర్థిక సంవత్సరంలో చైనా నుంచి దిగుమతులు 45% పెరగడం విడ్డూరం. చైనాపై ఇలా ఆధారపడటం ఇప్పుడు కొత్తగా వచ్చిందేమీ కాదు. కరోనా మహమ్మారి కాలంలో కూడామనం ఇలాగే చేశాం.” అని అన్నారు.

“భారతదేశంలో పారిశ్రామిక పునరుద్ధరణ ప్రారంభమైంది. పరిశ్రమలకు అవసరమైన ప్రధాన ముడి పదార్థాలు, విడి భాగాలు, ఇతర పారిశ్రామిక వస్తువులు మాత్రమే చైనా నుండి దిగుమతి చేసుకుంటున్నాం. మన దేశంలో పారిశ్రామిక పునరుద్ధరణ ప్రారంభమైందనడానికి ఇది సూచన‌. ఇది ఆందోళనకరమైన విషయం కాదు. భారత్ నుంచి ఎగుమతులు కూడా పెరిగాయి. ఒకవేళ మనం చైనా తయారు చేసిన‌ వస్తువులను మాత్రమే దిగుమతి చేసుకుంటే అది ఆందోళన కలిగించే విషయం” అని సీనియర్ ఆర్థికవేత్త ఆకాష్ జిందాల్ అన్నారు.

బీజేపీ నేతల మాటల్లో చేతల్లో ఇంత వైరుద్యముండటాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి? ఒకవైపు చైనాకు వ్యతిరేకంగా దేశప్రజలను రెచ్చగొట్టడం, మరో వైపు ఆ దేశంతో ఆర్థిక లావాదేవీలు రోజు రోజుకూ పెంచుకుంటూ ఉండటం ఎవరి ప్రయోజనాల కోసం ? ఇలా రెండు నాల్కల ధోరణితో వాళ్ళు ఈ దేశ ప్రజలను మోసం చేస్తున్నారని భావిస్తే తప్పేం ఉంది ?

Tags:    
Advertisement

Similar News