అసెంబ్లీ రద్దుపై శివసేన సంకేతం, మ‌ధ్యాహ్నం కేబినెట్ భేటీ

మహారాష్ట్రలో రాత్రికి రాత్రి జరిగిన ముఖ్య‌మైన రాజకీయ పరిణామాల తర్వాత, శివసేన జాతీయ అధికార ప్రతినిధి సంజయ్ రౌత్ కొద్దిసేప‌టి క్రితం కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న వ్యాఖ్య‌లు రాష్ట్ర అసెంబ్లీ ర‌ద్దుచేస్తార‌నే సంకేతాలుగా క‌న‌బ‌డుతున్నాయి. మ‌రి కొద్దిసేప‌ట్లో కేబినెట్ స‌మావేశం నిర్వ‌హించ‌నున్న‌ట్టు ప్ర‌భుత్వ వ‌ర్గాల ద్వారా తెలుస్తోంది. ‘అసెంబ్లీ రద్దు దిశగా రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు జ‌రుగుతున్నాయి.’ అంటూ మరాఠీలో ట్వీట్ చేశారు. తిరుగుబాటు నాయకుడు ఏక్‌నాథ్ షిండేతో బుధవారం “సానుకూల చర్చలు” జరిగాయని రౌత్ […]

Advertisement
Update:2022-06-22 07:36 IST

మహారాష్ట్రలో రాత్రికి రాత్రి జరిగిన ముఖ్య‌మైన రాజకీయ పరిణామాల తర్వాత, శివసేన జాతీయ అధికార ప్రతినిధి సంజయ్ రౌత్ కొద్దిసేప‌టి క్రితం కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న వ్యాఖ్య‌లు రాష్ట్ర అసెంబ్లీ ర‌ద్దుచేస్తార‌నే సంకేతాలుగా క‌న‌బ‌డుతున్నాయి. మ‌రి కొద్దిసేప‌ట్లో కేబినెట్ స‌మావేశం నిర్వ‌హించ‌నున్న‌ట్టు ప్ర‌భుత్వ వ‌ర్గాల ద్వారా తెలుస్తోంది.

‘అసెంబ్లీ రద్దు దిశగా రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు జ‌రుగుతున్నాయి.’ అంటూ మరాఠీలో ట్వీట్ చేశారు. తిరుగుబాటు నాయకుడు ఏక్‌నాథ్ షిండేతో బుధవారం “సానుకూల చర్చలు” జరిగాయని రౌత్ చెప్పిన కొద్దిసేప‌టికే ఈ ట్వీట్ వెలువ‌డ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. ” మా పార్టీ ఒక పోరాట యోధుడు లాంటిది, మేము నిలకడగా పోరాడుతూనే ఉంటాం. ఒక‌వేళ మేము అధికారం కోల్పోతే కోల్పోవ‌చ్చు. కానీ మేము పోరాడుతూనే ఉంటాము.” అని రౌత్ మీడియాతో అన్నారు.

తిరుగుబాటుకు నేతృత్వం వ‌హిస్తున్న షిండే త‌న‌కు 46 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంద‌ని ప్రకటించిన విష‌యం తెలిసిందే. వీరిలో పలువురు ఆయనతో పాటు సూరత్ నుండి గౌహతిలోని హోటల్‌కు ఈ తెల్లవారుజామున వెళ్లారు. వారిని హోట‌ల్ లో అస్సోం ముఖ్య‌మంత్రి శ‌ర్మ క‌లుసుకున్నారు. ఇదిలా ఉండ‌గా, ఈ మధ్యాహ్నం ఒంటి గంటకు మంత్రివర్గ సమావేశం జరగనుందని శివ‌సేన వ‌ర్గాలు తెలిపాయి.

Tags:    
Advertisement

Similar News