డీఆర్‌డీఎల్‌ ఉద్యోగిపై పాక్ హ‌నీ ట్రాప్..!

భార‌త్ ను దెబ్బతీసేందుకు పాకిస్తాన్ ఎప్పుడూ ప్ర‌య‌త్నిస్తూనే ఉంటుంద‌నేది అంద‌రికీ తెలిసిందే. భార‌త్ ర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ‌లు, సైనిక ర‌హ‌స్యాలు, ఆయుధ స‌మాచారం కోసం సంబంధిత ఉద్యోగుల‌కు ప‌లు ర‌కాలుగా ఎర వేయ‌డం ఎన్నోసార్లు విన్నాం. పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ సంస్థ ఐఎస్ఐ అమ్మాయిల పేరుతో మ‌గ ఏజెంట్లు, మ‌హిళా ఏజెంట్ల‌ను రంగంలోకి దింపి వ‌ల‌పు వ‌ల‌లు విసిరి భార‌త సైనిక స‌మాచారం సేక‌రించేందుకు ప్ర‌య‌త్నాలు చేయ‌డం కూడా జ‌రిగింది. తాజాగా అటువంటి సంఘ‌ట‌నే హైద‌రాబాద్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ […]

Advertisement
Update:2022-06-18 13:15 IST

భార‌త్ ను దెబ్బతీసేందుకు పాకిస్తాన్ ఎప్పుడూ ప్ర‌య‌త్నిస్తూనే ఉంటుంద‌నేది అంద‌రికీ తెలిసిందే. భార‌త్ ర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ‌లు, సైనిక ర‌హ‌స్యాలు, ఆయుధ స‌మాచారం కోసం సంబంధిత ఉద్యోగుల‌కు ప‌లు ర‌కాలుగా ఎర వేయ‌డం ఎన్నోసార్లు విన్నాం. పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ సంస్థ ఐఎస్ఐ అమ్మాయిల పేరుతో మ‌గ ఏజెంట్లు, మ‌హిళా ఏజెంట్ల‌ను రంగంలోకి దింపి వ‌ల‌పు వ‌ల‌లు విసిరి భార‌త సైనిక స‌మాచారం సేక‌రించేందుకు ప్ర‌య‌త్నాలు చేయ‌డం కూడా జ‌రిగింది. తాజాగా అటువంటి సంఘ‌ట‌నే హైద‌రాబాద్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ల్యాబొరేటరీ(డీఆర్‌డీఎల్‌)లో జ‌రిగింది.

హైద‌రాబాద్‌లోని డీఆర్‌డీఎల్‌ కి చెందిన మల్లికార్జునరెడ్డి (29) అనే ఉద్యోగికి పాకిస్తాన్ ఐఎస్ఐ మహిళా ఏజెంటు వలపు వల(హ‌నీ ట్రాప్‌) విసిరింది. ప్రేమ పేరుతో ఆయ‌న్ను ముగ్గులోకి దింపింది. పెళ్ళి చేసుకుందామంటూ కొద్దిరోజుల త‌ర్వాత మ‌రింత న‌మ్మ‌కం క‌లిగించి ఉచ్చు బిగించింది. అక్క‌డ నుంచి అత‌ని నుంచి భారత రక్షణ రంగానికి సంబంధించిన సమాచారం సేకరించ‌డం ప్రారంభించింది.

ఇది ఎలా జ‌రిగిందంటే..

మల్లికార్జున రెడ్డి తనకు డీఆర్‌డీఎల్‌ లో ఉద్యోగం వచ్చిందంటూ 2018లో ఫేస్ బుక్ లో పోస్టు పెట్టాడు. ఆ తర్వాత నటాషా రావు అనే పేరుతో ఓ మహిళ నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. బ్రిటన్ రక్షణ రంగ మ్యాగజైన్ లో తాను ఉద్యోగినని ఆమె పరిచయం చేసుకుంది. త‌మ‌ది బెంగ‌ళూరు అని, తన తండ్రి ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్ లో అధికారిగా ప‌నిచేస్తున్నార‌ని చెప్పింది. ఆమె తియ్య‌టి క‌బుర్ల‌కు మ‌ల్లిఖార్జున్ మురిసిపోయాడు. ఆ మహిళ మాయమాట‌ల్లో పడిన మల్లికార్జున క్షిపణుల అభివృద్ధికి సంబంధించిన సమాచారం, కొన్ని కీలక ఫొటోలను ఆమెకు పంపించాడు. ఇలా గ‌త ఏడాది డిసెంబరు వరకు ఈ తంతు కొనసాగింది.

ఎలా తెలుసుకున్నాడు..

అయితే, నటాషా తన ఫేస్ బుక్ ప్రొఫైల్ లో పేరును సిమ్రాన్ చోప్రా అని మార్చుకోవడంతో మల్లికార్జున రెడ్డి ఆమెతో చాటింగ్ చేయ‌డం మానుకున్నాడు. అయితే, ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి సమాచారం అందడంతో రాచకొండ పోలీసులు ఈ వ్యవహారంపై దృష్టిసారించారు. డీఆర్డీఎల్ లో కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేస్తున్న మల్లికార్జున రెడ్డి కీలక సమాచారం లీక్ చేశాడని గుర్తించారు. హైదరాబాదులోని మీర్ పేటలో మల్లికార్జున రెడ్డిని నిన్న అరెస్ట్ చేశారు.

Tags:    
Advertisement

Similar News