ఈ కథనాలు రాసిన వారికి కనీస జ్ఞానం లేదు

పంట బీమా పరిహారం చెల్లింపుపై ఎల్లో మీడియా తప్పుడు కథనాలు రాసిందని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి విమర్శించారు. కథనాలు రాసిన విధానం చూస్తుంటే రాసిన వారికి సరైన శిక్షణ కల్పించాల్సిన అవసరం కనిపిస్తోందన్నారు. లబ్దిదారులు 30 లక్షల మంది ఉంటే పరిహారం 15 లక్షల మందికి ఇచ్చారని రాయడం బట్టే వారి అవగాహన ఏపాటిదో అర్ధమవుతోందన్నారు. ఎల్లో మీడియా తీరుచూస్తుంటే మొత్తం రైతులంతా నష్టపోవాలని కోరుకుంటున్నట్టుగా ఉందన్నారు. 31 పంటలకు 30 […]

Advertisement
Update:2022-06-16 06:40 IST

పంట బీమా పరిహారం చెల్లింపుపై ఎల్లో మీడియా తప్పుడు కథనాలు రాసిందని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి విమర్శించారు. కథనాలు రాసిన విధానం చూస్తుంటే రాసిన వారికి సరైన శిక్షణ కల్పించాల్సిన అవసరం కనిపిస్తోందన్నారు.

లబ్దిదారులు 30 లక్షల మంది ఉంటే పరిహారం 15 లక్షల మందికి ఇచ్చారని రాయడం బట్టే వారి అవగాహన ఏపాటిదో అర్ధమవుతోందన్నారు. ఎల్లో మీడియా తీరుచూస్తుంటే మొత్తం రైతులంతా నష్టపోవాలని కోరుకుంటున్నట్టుగా ఉందన్నారు. 31 పంటలకు 30 లక్షల మంది రైతులు బీమా చేస్తే అందరికీ డబ్బులు ఇస్తారనుకుంటున్న మీడియా జ్ఞానానికి జోహర్లు అన్నారు.

30 లక్షల మంది రైతులు పంట బీమా చేయించినా.. నష్టపోయిన వారికే పరిహారం ఇస్తారన్న విషయం కూడా తెలియదా అని ప్రశ్నించారు. ప్రతి కారుకూ ఇన్సూరెన్స్‌ చేయిస్తారని.. అలానీ యాక్సిడెంట్ జరగకపోయినా కారుకు పరిహారం ఇచ్చేస్తారా అని ప్రశ్నించారు. ఈ – క్రాప్‌లో నమోదు చేసుకుని పంట నష్టపోయిన ప్రతి ఒక్కరికీ పరిహారం ఇచ్చామన్నారు. ఈ విషయం తెలియకుండా కథనాలు రాశారంటే ఎడిటర్లకు కూడా అవగాహన ఉన్నట్టు కనిపించడం లేదన్నారు.

పంట నష్టపరిహారం అంటే రైతు భరోసా లాంటి పథకం అని పత్రికలు భావిస్తున్నట్టుగా ఉందన్నారు. అందుకే ప్రతి ఒక్కరికీ పరిహారం ఇవ్వాలని కథనాలు రాశాయన్నారు. ఏ విత్తనం నాటితే ఏ పంట వస్తుందో తెలియని నారా లోకేష్‌ కూడా తమకు లేఖ రాస్తున్నారని విమర్శించారు. ఆరిపోయే టీడీపీ దీపానికి పవన్‌ కల్యాణ్ చేతులు అడ్డుపెట్టి కాపాడాలనుకుంటున్నారని కాకాణి వ్యాఖ్యానించారు.

Tags:    
Advertisement

Similar News