జగన్ ముందుకు హిందూపురం పంచాయితీ..
ఇటీవల వైసీపీలో అక్కడక్కడా అంతర్గత పంచాయితీలు ఎక్కువయ్యాయి. విశాఖలో ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ వ్యవహారాన్ని ఇటీవలే చక్కబెట్టింది అధిష్టానం. సమన్వయకర్త పోస్ట్ కి రాజీనామా చేసిన ఆయన, జగన్ మాట మేరకు వెనక్కి తగ్గారు. ఆ తర్వాత గన్నవరం వ్యవహారం హాట్ హాట్ గా సాగుతోంది. ఆమధ్య గన్నవరం ఇష్యూకి సజ్జల శుభం కార్డు వేశారని అనుకున్నా.. ఆ మంట మళ్లీ రాజుకుంది. తాజాగా ఇప్పుడు హిందూపురం నియోజకవర్గంలో నేతల మధ్య సమన్వయంకోసం ప్రయత్నిస్తున్నారు సీఎం […]
ఇటీవల వైసీపీలో అక్కడక్కడా అంతర్గత పంచాయితీలు ఎక్కువయ్యాయి. విశాఖలో ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ వ్యవహారాన్ని ఇటీవలే చక్కబెట్టింది అధిష్టానం. సమన్వయకర్త పోస్ట్ కి రాజీనామా చేసిన ఆయన, జగన్ మాట మేరకు వెనక్కి తగ్గారు. ఆ తర్వాత గన్నవరం వ్యవహారం హాట్ హాట్ గా సాగుతోంది. ఆమధ్య గన్నవరం ఇష్యూకి సజ్జల శుభం కార్డు వేశారని అనుకున్నా.. ఆ మంట మళ్లీ రాజుకుంది. తాజాగా ఇప్పుడు హిందూపురం నియోజకవర్గంలో నేతల మధ్య సమన్వయంకోసం ప్రయత్నిస్తున్నారు సీఎం జగన్.
రైతు బీమా సొమ్ము ఖాతాల్లో వేసే కార్యక్రమం కోసం సత్యసాయి జిల్లాకు వెళ్లారు సీఎం జగన్. ఆ సందర్భంగా హిందూపురం నియోజకవర్గ మాజీ ఇన్ చార్జ్ వేణుగోపాల్ రెడ్డితో పార్టీ పరిస్థితిని చర్చించారు. అయితే.. ప్రస్తుత ఇన్ చార్జి, ఎమ్మెల్సీ ఇక్బాల్ పనితీరుపై వేణుగోపాల్ రెడ్డి సీఎంకు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. వెంటనే సీఎం.. ఎమ్మెల్సీ ఇక్బాల్ ని పిలిచి వివరణ అడిగారట. సీఎం ముందే ఇద్దరూ పరస్పరం ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నారు.
హిందూపురంలో ప్రస్తుతం టీడీపీ తరపున నందమూరి బాలకృష్ణ ఎమ్మెల్యేగా ఉన్నారు. 2024 నాటికి ఆ సీటుని కైవసం చేసుకోవాలని వైసీపీ చూస్తోంది. 2019లో బాలకృష్ణ చేతిలో మహ్మద్ ఇక్బాల్ 17వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆ తర్వాత ఆయనకు ఎమ్మెల్సీ పదవి దక్కింది. ప్రస్తుతం ఆయన హిందూపురం నియోజకవర్గానికి ఇన్ చార్జిగా ఉన్నారు. ఆయన ఎమ్మెల్సీ కావడంతో, ఈసారి అక్కడ వేణుగోపాల్ రెడ్డి పోటీ చేయాలనుకుంటున్నారు. దీంతో వీరిద్దరి మధ్య వైరం మొదలైంది. పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులున్నాయి. ఈ వ్యవహారం పార్టీకి నష్టం చేకూర్చేలా ఉండటంతో.. సీఎం జగన్ హిందూపురంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ వివాదానికి తెరదించే బాధ్యతను మంత్రి పెద్దిరెడ్డికి అప్పగించారు.