సుజనా, కామినేనితో తిరుగుతున్నది ఎవరు?
వైసీపీలో అక్కడక్కడ నేతల మధ్య విబేధాలు వెలుగు చూస్తున్నాయి. ఇప్పుడు బందరు వంతు వచ్చింది. మాజీ మంత్రి పేర్ని నాని, వైసీపీ ఎంపీ బాలశౌరి మధ్య వివాదం వెలుగులోకి వచ్చింది. పేర్ని నానిపై బాలశౌరి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎంపీ బాలశౌరి మచిలీపట్నం వచ్చిన సమయంలో పేర్నినాని ముఖ్య అనుచరుడైన వైసీపీ కార్పొరేటర్ అలీ తన అనుచరులతో కలిసి అడ్డుకున్నారు. ఎంపీని బూతులు తిడుతూ కార్పొరేటర్ అలీ రెచ్చిపోయాడు. ముస్లిం శ్మశానవాటికను పరిశీలించేందుకు ఎంపీ వెళ్లిన సమయంలో […]
వైసీపీలో అక్కడక్కడ నేతల మధ్య విబేధాలు వెలుగు చూస్తున్నాయి. ఇప్పుడు బందరు వంతు వచ్చింది. మాజీ మంత్రి పేర్ని నాని, వైసీపీ ఎంపీ బాలశౌరి మధ్య వివాదం వెలుగులోకి వచ్చింది.
పేర్ని నానిపై బాలశౌరి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎంపీ బాలశౌరి మచిలీపట్నం వచ్చిన సమయంలో పేర్నినాని ముఖ్య అనుచరుడైన వైసీపీ కార్పొరేటర్ అలీ తన అనుచరులతో కలిసి అడ్డుకున్నారు. ఎంపీని బూతులు తిడుతూ కార్పొరేటర్ అలీ రెచ్చిపోయాడు. ముస్లిం శ్మశానవాటికను పరిశీలించేందుకు ఎంపీ వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది. పేర్నినాని అనుచరులు అడ్డుకునేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిసిన ఒక పోలీసు అధికారి.. ఆ విషయాన్ని ఎంపీకి చెప్పి అక్కడికి వెళ్లవద్దని కోరారు.
అందుకు ఎంపీ నిరాకరించారు. సొంత నియోజకవర్గంలో తాను తిరగకపోతే ఎలా అని ప్రశ్నించారు. వెంటనే శ్మశాన వాటిక పరిశీలనకు వెళ్లారు. ఊహించినట్టుగావైసీపీ కార్పొరేటర్ అలీ ఊగిపోయాడు. ఎంపీ అన్న గౌరవం కూడా లేకుండా బాలశౌరి వెళ్లిపోవాలంటూ నినాదాలు చేశాడు. అలీ .. పేర్నినానికి ప్రధాన అనుచరుడు కావడంతో ఎంపీ నేరుగా నానిపై గురి పెట్టారు.
బందరు ఎమ్మెల్యే ఆగడాలకు అడ్డుఅదుపు లేకుండాపోతోందని విమర్శించారు. బందరు ఏమైనా నీ అడ్డానా అని ప్రశ్నించారు. సొంత పార్టీ ఎంపీ అన్న ఆలోచన కూడా లేకుండా అడ్డుకుంటారా అని ఫైర్ అయ్యారు. బీజేపీ నేతలు సుజనాచౌదరి, కామినేని శ్రీనివాస్‌లతో పేర్నినాని కలిసి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని విమర్శించారు. సీఎంను వారు విమర్శిస్తున్నా కనీసం ఎదురు చెప్పడం లేదన్నారు.
వారానికి ఒకసారైనా టీడీపీ మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణతో మాట్లాడకపోతే నానికి నిద్రపట్టదని ఆరోపించారు. ఇక నుంచి తాను ఇక్కడే ఉంటానని… ఒక ఎంపీ అంటే ఏంటో చూపిస్తానన్నారు. మూడేళ్లలో ఒకసారైనా ఎంపీని ఏ కార్యక్రమానికైనా ఆహ్వానించారా… మీరా ప్రోటోకాల్ గురించి మాట్లాడేది అంటూ ఎంపీ ఫైర్ అయ్యారు.పేర్నినాని వల్ల మచిలీపట్నంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోయాయని విమర్శించారు.