ఇన్ స్టాగ్రామ్ తో కొహ్లీకి డబ్బే డబ్బు! పోస్టుకు 5 కోట్ల సంపాదన 20 కోట్లకు చేరిన అభిమానులు

క్రికెట్ ఫీల్డ్ లో గత రెండేళ్లుగా వెలవెల బోతున్న భారత మాజీ కెప్టెన్, దిగ్గజ క్రికెటర్ విరాట్ కొహ్లీ…సోషల్ మీడియాలో మాత్రం కళకళ లాడుతున్నాడు. క్రికెటర్ గా రికార్డులు నెలకొల్పడం మరచిపోయిన విరాట్…సోషల్ మీడియా వేదికల్లో ఒకటైన ఇన్ స్టా గ్రామ్ లో సరికొత్త రికార్డు నెలకొల్పడంతో పాటు..ఫీల్డ్ వెలుపలా కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు. అమాంతం పెరిగిన ఫాలోవర్స్….. కరోనా విలయతాండవానికి ముందు వరకూ క్రికెట్ మూడు ఫార్మాట్లలో ఒక వెలుగు వెలిగిన విరాట్ కొహ్లీ తన […]

Advertisement
Update:2022-06-10 03:49 IST

క్రికెట్ ఫీల్డ్ లో గత రెండేళ్లుగా వెలవెల బోతున్న భారత మాజీ కెప్టెన్, దిగ్గజ క్రికెటర్ విరాట్ కొహ్లీ…సోషల్ మీడియాలో మాత్రం కళకళ లాడుతున్నాడు.

క్రికెటర్ గా రికార్డులు నెలకొల్పడం మరచిపోయిన విరాట్…సోషల్ మీడియా వేదికల్లో ఒకటైన ఇన్ స్టా గ్రామ్ లో సరికొత్త రికార్డు నెలకొల్పడంతో పాటు..ఫీల్డ్ వెలుపలా
కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు.
అమాంతం పెరిగిన ఫాలోవర్స్…..

కరోనా విలయతాండవానికి ముందు వరకూ క్రికెట్ మూడు ఫార్మాట్లలో ఒక వెలుగు వెలిగిన విరాట్ కొహ్లీ తన ఆటతీరుతో కోట్లాదిమంది అభిమానులను, సోషల్ మీడియా వేదికల ద్వారా తనను అనుసరించేవారి సంఖ్యను ఏడాది ఏడాదికీ గణనీయంగా పెంచుకొంటూ వస్తున్నాడు.

గత దశాబ్దకాలంగా తన బ్రాండ్ వాల్యూని సైతం అనూహ్యంగా పెంచుకొని రెండు చేతులా ఆర్జిస్తున్నాడు. అంతటితోనే ఆగిపోకుండా…సోషల్ మీడియా ద్వారాను… తన పాపులారిటీని కోట్లరూపాయలుగా మలచుకొంటున్నాడు.

పోస్ట్ కు 5 కోట్లు

కొహ్లీ తన ఇన్ స్టాగ్రామ్ ద్వారా ఓ ప్రమోషనల్ పోస్ట్ ను ఉంచినందుకు 5 కోట్ల రూపాయలు చొప్పున వసూలు చేస్తున్నాడు. ప్రపంచ సాకర్ సూపర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డోతో సమానంగా…ఇన్ స్టాగ్రామ్ ప్రమోషనల్ ఆదాయం సంపాదిస్తున్నాడు.
29 ఏళ్ల విరాట్ కొహ్లీకి…ఫేస్ బుక్ ద్వారా..3 కోట్ల 60 లక్షల లైక్ లు వస్తున్నాయి. ట్విట్టర్ లో కొహ్లీని 2 కోట్లమంది, ఇన్ స్టాగ్రామ్ ద్వారా 20 కోట్ల మంది అనుసరిస్తున్నారు. ఫోర్బెస్ తాజా ర్యాంకింగ్స్ ప్రకారం అత్యధిక సంపాదన ఉన్న…ప్రపంచ క్రీడాప్రముఖుల్లో విరాట్ కొహ్లీ మొదటి 10 మందిలో ఒకనిగా నిలిచాడు,

తొలి క్రికెటర్ విరాట్ కొహ్లీ….

గత ఏడాది వరకూ ఇన్‌స్టాగ్రామ్‌లో విరాట్ ను అనుసరించే వారి సంఖ్య 15 కోట్లుగా ఉంది. అయితే ..హాప‌ర్‌హెచ్‌క్యూ 2022 ఇన్‌స్టాగ్రామ్ రిచ్‌లిస్ట్ విడుదల చేసింది.

తాజా గణాంకాల ప్రకారం అది కాస్త 20 కోట్ల (200 మిలియన్లు )కు చేరింది.

ఇన్ స్టా గ్రామ్ ద్వారా ఈ ఘనత సాధించిన తొలి భారత క్రీడాకారుడు మాత్రమే కాదు..తొలి క్రికెటర్ గాను కొహ్లీ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఆసియాఖండానికి చెందిన తొలి వ్యక్తిగా కూడా విరాట్ రికార్డుల్లో చోటు సంపాదించాడు.

ప్రపంచవ్యాప్తంగా క్రీడాదిగ్గజాల వరుస నాలుగో స్థానంలో విరాట్ కొనసాగుతున్నాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో 337 మిలియన్ల ఫాలోవర్లతో పోర్చుగల్‌ స్టార్‌ క్రిస్టియానో రొనాల్డో తొలి స్థానంలో ఉండగా.. మెస్సీ (260 మిలియన్లు), కొహ్లీ 200 మిలియన్లు, నెయ్‌మర్‌ (160 మిలియన్లు) మొదటి నాలుగు స్థానాలలో కొనసాగుతున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌తో పాటు ట్విట్టర్‌ (43.4 మిలియన్లు), ఫేస్‌బుక్‌ (48 మిలియన్లు)లో కూడా కోహ్లీకి విపరీతమైన క్రేజ్‌ ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో విరాట్‌ ఒక స్పాన్సర్‌ పోస్టు ద్వారా రూ. 5 కోట్ల ఆదాయం ఆర్జిస్తున్నాడు.

రొనాల్డో పోస్టుకు 11 కోట్లు…

విరాట్ కోహ్లి ఇన్ స్టా గ్రామ్ పోస్టుకు 5 కోట్లు సంపాదిస్తుంటే…పోర్చుగీసు సాకర్ సూపర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో మాత్రం ఇన్‌స్టాగ్రామ్‌లో ప్ర‌పంచంలోనే అత్య‌ధిక మంది ఫాలోవ‌ర్లు ఉన్న క్రీడాకారుడిగా నిలిచాడు.ఒక్కో పోస్ట్‌కు రూ.11 కోట్లు వ‌సూలు చేస్తున్నాడు‌. ఇత‌నితో స‌మానంగా డ‌బ్ల్యూడ‌బ్ల్యూఈ, హాలీవుడ్ స్టార్ డ్వేన్ జాన్స‌న్ కూడా అంతే మొత్తం తీసుకుంటుండ‌టం విశేషం.

త‌ర్వాత ప్రియాంకా చోప్రా రూ.3 కోట్ల‌తో 27వ స్థానంలో ఉంది. మొత్తం 395 మంది సెల‌బ్రిటీలు ఉన్న లిస్ట్‌లో విరాట్ కొహ్లీ మినహా మరే భారత క్రికెట‌ర్ లేకపోడం విశేషం.

Tags:    
Advertisement

Similar News