లంచ్ బ్రేక్.. టీమిండియా స్కోర్ 275/1
సెంచరీతో అదరగొట్టిన యశస్వి జైస్వాల్.. 321 రన్స్ లీడ్‌లో ఉన్న భారత్
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మొదటి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో లంచ్ బ్రేక్ సమయానికి టీమిండియా 275/1 రన్స్ చేసింది. 321 రన్స్ లీడ్‌లో ఉన్నది. యశస్వి జైస్వాల్ (141 నాటౌట్), దేవ్‌దత్ పడిక్కల్ (25 నాటౌట్) క్రీజులో ఉన్నారు. కేఎల్ రాహుల్ 77 రన్స్‌చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 150, ఆసీస్ 104 రన్స్ చేసిన విషయం విదితమే.
బోర్డర్-గావస్కర్ ట్రోఫిని విజయంతో ప్రారంభించే దిశగా టీమిండియా దూసుకుపోతున్నది. మొదటి రోజు బ్యాటర్ల వైఫల్యం తర్వాత బౌలర్ల అద్భుత ప్రదర్శనతో టీమిండియా పైచేయి సాధించింది. రెండో ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్‌ల జోడి అదరగొట్టింది. రెండో రోజు ఆట చివరికి 172/0 తిరుగులేని స్థితిలో నిలిచింది. అప్పటికే యశస్వి జైస్వాల్ 90 పరుగులతో సెంచరీకి చేరువ అయ్యారు. కేఎల్ రాహుల్ 62 రన్స్‌తో క్రీజులో ఉన్నాడు. మూడో రోజు ఆట ప్రారంభించే సమయానికి భారత్ 218 రన్స్ లీడ్‌లో ఉన్నది. ఈ క్రమంలోఏ 205 బాల్స్‌లో యశస్వీ సెంచరీ సాధించాడు. ఆసీస్‌పై తొలి టెస్టులోనే సెంచరీ చేసిన మూడో బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. ఆస్ట్రేలియాలో అత్యంత పిన్న వయసులో సెంచరీ చేసిన రెండో బ్యాటర్ కూడా యశస్వినే (22 ఏళ్ల 330 రోజులు). కేఎల్ రాహుల్ 176 బాల్స్‌లో 77 రన్స్ వద్ద ఉండగా స్టార్క్ ఔట్ చేశాడు. దీంతో తొలి వికెట్‌కు 201 రన్స్ భాగస్వామ్యానికి తెరపడింది. మరోవైపు మొదటి 15 టెస్టుల్లో 1500 పరుగులు చేసిన మొదటి ఆసియా బ్యాటర్‌గా యశస్వి రికార్డు సృష్టించాడు.