తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి : టీటీడీ ఈవో

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు ఈనెల 28వ తేదీ నుండి డిసెంబర్ 6వ తేదీ వరకు నిర్వహిస్తామని టీటీడీ ఈవో శ్యామల రావు తెలిపారు.

Advertisement
Update:2024-11-23 21:45 IST

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు ఈనెల 28వ తేదీ నుండి డిసెంబర్ 6వ తేదీ వరకు నిర్వహిస్తామని టీటీడీ ఈవో శ్యామల రావు తెలిపారు. అయితే డిసెంబర్ 6న జరిగే పంచమి తీర్థ చక్రస్నాన మహోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఈ పంచమి తీర్థానికి వేలాది మంది భక్తులు వస్తారు. కాబట్టి ఆ రోజు ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు లేకుండా చర్యలు చేపడుతున్నాం అని టీటీడీ ఈవో తెలిపారు.ఇ క పంచమి తీర్థానికి విచ్చేసే భక్తులకు ముందు రోజు రాత్రి నుండే.. వారికి కేటాయించిన ప్రాంతాల్లో భోజనం మొదలుకొని అన్ని రకాల వసతి సౌకర్యాలు ఏర్పాటై చేస్తున్నమన్నారు.

ప్రస్తుతానికి బ్రహ్మోత్సవ ఏర్పాట్లు అన్నీ పూర్తయ్యాయి. అయితే పంచమి రోజున 1500 మంది అదనపు సిబ్బందితో భద్రతా ఉంటుంది. గత ఏడాది కన్నా ఈ ఏడాది అత్యంత వైభవంగా పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో నిర్వహిస్తున్నాము. అని పేర్కొన ఈవో శ్యామల రావు.. అధికారులు చేపట్టిన ఏర్పాట్లు అన్ని సంతృప్తికరంగా ఉన్నాయి అని పేర్కొన్నారు.హోల్డింగ్ పాయింట్ల వద్ద అవసరమైన సిబ్బందిని అందుబాటులో ఉంచుకోవాలని భక్తులకు అసౌకర్యం కలగకుండా చూసుకోవాలని చెప్పారు. పారిశుద్ధ్య విషయంలో కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి లేదని ఆరోగ్యశాఖ అధికారులు స్థానిక పంచాయతీ అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. భక్తుల సౌకర్యార్థం అవసరమైన వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచాలని సూచించారు

Tags:    
Advertisement

Similar News