తెలంగాణలో పెరుగుతున్న కరోనా – ఆరోగ్యశాఖ వెల్లడి

తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్నాయని రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. గత వారం 355 కేసులు నమోదు కాగా ఈ వారం 555 కేసులు నమోదయ్యాయని, 56 శాతం కేసుల పెరుగుదల నమోదు అయ్యిందని ఆరోగ్య శాఖ డైరెక్టర్‌ శ్రీనివాసరావు తెలిపారు. తెలంగాణలో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆయన ఈ రోజు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కరోనా ప్రమాదం ఇంకా పోలేదని, సబ్ వేరియంట్స్ సమస్యలు సృష్టిస్తూనే ఉన్నాయని అన్నారు. వచ్చే డిశంబర్ వరకు ఇదే […]

Advertisement
Update:2022-06-10 10:48 IST

తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్నాయని రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. గత వారం 355 కేసులు నమోదు కాగా ఈ వారం 555 కేసులు నమోదయ్యాయని, 56 శాతం కేసుల పెరుగుదల నమోదు అయ్యిందని ఆరోగ్య శాఖ డైరెక్టర్‌ శ్రీనివాసరావు తెలిపారు.

తెలంగాణలో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆయన ఈ రోజు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కరోనా ప్రమాదం ఇంకా పోలేదని, సబ్ వేరియంట్స్ సమస్యలు సృష్టిస్తూనే ఉన్నాయని అన్నారు. వచ్చే డిశంబర్ వరకు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉన్నదని చెప్పిన శ్రీనివాసరావు మాస్క్ లు ఖచ్చితంగా ధరించాలని, అన్ని జాగ్రత్తలూ పాటించాలని, జ్వరం, తలనొప్పి, వాసన లేకపోతే కచ్చితంగా టెస్ట్‌ చేయించుకోవాలని చెప్పారు.

అయితే పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ ఎవరూ ఆస్పత్రుల్లో చేరడం లేదని, మరణాలు కూడా లేవని అన్నారు.

Tags:    
Advertisement

Similar News