పవన్ జతకట్టేది టీడీపీతోనేనా.. బీజేపీకి దూరమయ్యే ఆలోచనలో జనసేనాని?
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను ఇప్పటికీ పార్ట్‌టైం పొలిటీషియన్‌గానే చాలా మంది చూస్తుంటారు. ఎన్నికల సమయంలో హడావిడి చేయడం.. ఆ తర్వాత కామ్‌గా సినిమాలు చేసుకోవడం పవన్ నైజం అయ్యింది. అయితే ఇటీవల ఏపీలో ఎన్నికల మూడ్ పెరిగిపోవడంతో పవన్ కల్యాణ్ కూడా రాష్ట్ర రాజకీయాలపై దృష్టి పెట్టారు. ఇప్పటి వరకు జనసేన-బీజేపీ పొత్తుపై బాహాటంగా ప్రకటించకపోయినా.. బీజేపీ రాష్ట్ర నాయకులు మాత్రం పవన్ పార్టీతో పొత్తు ఉంటుందని చెప్తున్నారు. కాగా, పవన్ అసలు వ్యూహం మాత్రం […]
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను ఇప్పటికీ పార్ట్‌టైం పొలిటీషియన్‌గానే చాలా మంది చూస్తుంటారు. ఎన్నికల సమయంలో హడావిడి చేయడం.. ఆ తర్వాత కామ్‌గా సినిమాలు చేసుకోవడం పవన్ నైజం అయ్యింది. అయితే ఇటీవల ఏపీలో ఎన్నికల మూడ్ పెరిగిపోవడంతో పవన్ కల్యాణ్ కూడా రాష్ట్ర రాజకీయాలపై దృష్టి పెట్టారు. ఇప్పటి వరకు జనసేన-బీజేపీ పొత్తుపై బాహాటంగా ప్రకటించకపోయినా.. బీజేపీ రాష్ట్ర నాయకులు మాత్రం పవన్ పార్టీతో పొత్తు ఉంటుందని చెప్తున్నారు.
కాగా, పవన్ అసలు వ్యూహం మాత్రం టీడీపీని తిరిగి అధికారంలోకి తీసుకొని రావడం మాత్రమే అని అంటున్నారు. చంద్రబాబును మళ్లీ సీఎం చేయాలనే లక్ష్యంతోనే ఆయన అడుగులు వేస్తున్నారని చెప్తున్నారు. తాజాగా పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు దీనికి మరింత బలాన్ని చేకూర్చాయి. తనకు రాష్ట్ర బీజేపీ నాయకులతో పని లేదని.. జాతీయ నాయకులతో మాత్రమే తాను టచ్‌లో ఉంటున్నానని చెప్పుకొచ్చారు. ఇన్నాళ్లూ రాష్ట్ర బీజేపీ నాయకులు పవన్‌ను సొంత పార్టీ నాయకుడి కంటే ఎక్కువగా భుజాన మోశారు. కానీ పవన్ మాత్రం వారిని కూరలో కరివేపాకులాగ తీసి పారేయడం రాజకీయా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
రాజమండ్రిలో బీజేపీ నిర్వహించనున్న గోదావరి గర్జన కార్యక్రమానికి జేపీ నడ్డా హాజరవుతున్నారు. దీనికి మిత్రపక్ష నేతగా పవన్ కల్యాన్‌ను పిలవాలని తొలుత భావించారు. అయితే తాను జేపీ నడ్డాను కలవబోనని పవన్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో బీజేపీతో జట్టు కట్టాలని అనుకున్నట్లయితే.. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడితో కలవడానికి ఇబ్బంది ఏముంటుందని ప్రశ్నిస్తున్నారు. పవన్ కావాలనే బీజేపీతో ఆచితూచి వ్యవహరిస్తున్నారని అంటున్నారు. పవన్ వ్యవహరిస్తున్న తీరు ప్రస్తుతం రాష్ట్ర బీజేపీ నాయకులకు కూడా రుచించడం లేదు.
మరోవైపు రాష్ట్రం ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూడాలంటే బీజేపీతో కంటే టీడీపీతో జట్టు కడితేనే లాభమని పలువురు సూచించారు. ఆ మేరకే పవన్ కల్యాణ్ కూడా టీడీపీతో పొత్తు పెట్టుకోవడానికే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తున్నది. బీజేపీతో వైసీపి టర్మ్స్ బాగున్న సమయంలో ఆ పార్టీతోనే పొత్తు ఎలా పెట్టుకుంటారని కూడా విమర్శలు రావడంతో పవన్ వెనక్కు తగ్గుతున్నట్లు తెలుస్తున్నది. కేంద్ర ప్రభుత్వంతో సన్నిహితంగా ఉంటూనే.. రాష్ట్రంలో మాత్రం టీడీపీతో పొత్తుకు రంగం సిద్దం చేస్తున్నట్లు తెలుస్తున్నది.