ఆ నిబంధన ఒక అధికారి సొంత నిర్ణయం- అంబటి రాంబాబు

ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉన్నప్పుడే బిల్లులు చెల్లిస్తాం.. బిల్లుల చెల్లింపు ఆలస్యంపై కోర్టుకు వెళ్లడానికి వీల్లేదంటూ జలవనరుల శాఖలో ఇటీవల వచ్చిన టెండర్ నిబంధనపై మంత్రి అంబటి రాంబాబు వివరణ ఇచ్చారు. అలాంటి నిబంధన చేర్చాలని ప్రభుత్వం చెప్పలేదని.. ఒక అధికారి సొంత ఆలోచనతో ఆ పనిచేశారని వివరించారు. నిధుల లభ్యతను బట్టి టెండర్లు పిలవాల్సిందిగా అధికారులకు ప్రభుత్వం సూచించిందని.. నిధులు చూసుకోకుండా టెండర్లు పిలిస్తే ఇబ్బంది వస్తుందన్న ఉద్దేశంతో సలహా ఇస్తే.. ఒక చోట మాత్రం […]

Advertisement
Update:2022-06-03 12:41 IST

ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉన్నప్పుడే బిల్లులు చెల్లిస్తాం.. బిల్లుల చెల్లింపు ఆలస్యంపై కోర్టుకు వెళ్లడానికి వీల్లేదంటూ జలవనరుల శాఖలో ఇటీవల వచ్చిన టెండర్ నిబంధనపై మంత్రి అంబటి రాంబాబు వివరణ ఇచ్చారు. అలాంటి నిబంధన చేర్చాలని ప్రభుత్వం చెప్పలేదని.. ఒక అధికారి సొంత ఆలోచనతో ఆ పనిచేశారని వివరించారు.

నిధుల లభ్యతను బట్టి టెండర్లు పిలవాల్సిందిగా అధికారులకు ప్రభుత్వం సూచించిందని.. నిధులు చూసుకోకుండా టెండర్లు పిలిస్తే ఇబ్బంది వస్తుందన్న ఉద్దేశంతో సలహా ఇస్తే.. ఒక చోట మాత్రం ఒక అధికారి సొంతంగా నిర్ణయం తీసుకుని ప్రభుత్వం వద్ద డబ్బులు ఉన్నప్పుడే బిల్లులు చెల్లిస్తాం, కోర్టుకు వెళ్లడానికి వీల్లేదంటూ నిబంధన చేర్చారని అంబటి వివరించారు. ఆ నిబంధన చట్టరిత్యా సరైనది కాదని మంత్రి అంగీకరించారు. ఆ నిబంధనను ప్రభుత్వం కూడా సమర్ధించడం లేదన్నారు. ఒక చోట 13 కోట్ల రూపాయల టెండర్ విషయంలో జరిగిన అంశాన్ని పట్టుకుని రాష్ట్రం మొత్తం బిల్లులు ఆగిపోయినట్టు ప్రచారం చేస్తున్నారని అంబటి మండిపడ్డారు.

అధికారంలో నుంచి దిగిపోతూ వేల కోట్ల రూపాయల బకాయిలు పెండింగ్‌లో పెట్టి వెళ్లిన చంద్రబాబు ఈరోజు మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. చంద్రబాబు దివాళా తీసిన ప్రభుత్వాన్ని అప్పగిస్తే తాము నడుపుతున్నామన్నారు. పోలవరం నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుగా ఖర్చు పెడితే.. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం డబ్బులు చెల్లించడం కాకుండా.. ముందుగా కేంద్రమే అడ్వాన్స్‌గా డబ్బులు ఇస్తే పనులు వేగంగా జరుగుతాయని ప్రధానికి సీఎం జగన్ వివరించారన్నారు. ఆ ప్రతిపాదనకు ఎలాంటి ప్రతిస్పందన వస్తుందో చూడాలన్నారు.

పోలవరం డయాఫ్రం వాల్ కొట్టుకుపోవడానికి చంద్రబాబే కారణమని.. అదే తప్పు ఇతర దేశాల్లో చేసి ఉంటే చంద్రబాబుకు ఉరి తీసేవారన్నారు. టీడీపీ బలపడిందని చెబుతున్న చంద్రబాబు.. ఆత్మకూరులో పోటీ చేయాలని, వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటించాలని అంబటి సవాల్ చేశారు.

ALSO READ: ఆర్యసమాజ్ ఇచ్చే మ్యారేజ్ సర్టిఫికెట్ చెల్లదు – సుప్రీంకోర్టు కీలక తీర్పు..

Tags:    
Advertisement

Similar News