న్యాయసమీక్ష లేకుండా అదానీకి ఏపీ బొగ్గు కాంట్రాక్టు
ఆంధ్రప్రదేశ్ థర్మల్ విద్యుత్ ప్లాంట్లకు బొగ్గు సరఫరా చేసే కాంట్రాక్టును అదానీ, చెట్టినాడు సంస్థలు దక్కించుకున్నాయి. ఒప్పందం ప్రకారం అదానీ సంస్థ 18 లక్షల టన్నులు, చెట్టినాడు సంస్థ 13 లక్షల టన్నుల బొగ్గును సరఫరా చేస్తాయి. టెండర్లలో ఈ రెండు సంస్థలు మాత్రమే బిడ్ దాఖలు చేశాయి. అదానీ సంస్థ సరఫరా చేసే బొగ్గును టన్నుకు రూ. 24,500, చెట్టినాడు సరఫరా చేసే బొగ్గుకు 19,500 రూపాయలను చెల్లించి ఏపీ జెన్‌కో కొనుగోలు చేస్తుంది. ఏడాదిలో […]
ఆంధ్రప్రదేశ్ థర్మల్ విద్యుత్ ప్లాంట్లకు బొగ్గు సరఫరా చేసే కాంట్రాక్టును అదానీ, చెట్టినాడు సంస్థలు దక్కించుకున్నాయి. ఒప్పందం ప్రకారం అదానీ సంస్థ 18 లక్షల టన్నులు, చెట్టినాడు సంస్థ 13 లక్షల టన్నుల బొగ్గును సరఫరా చేస్తాయి. టెండర్లలో ఈ రెండు సంస్థలు మాత్రమే బిడ్ దాఖలు చేశాయి.
అదానీ సంస్థ సరఫరా చేసే బొగ్గును టన్నుకు రూ. 24,500, చెట్టినాడు సరఫరా చేసే బొగ్గుకు 19,500 రూపాయలను చెల్లించి ఏపీ జెన్‌కో కొనుగోలు చేస్తుంది. ఏడాదిలో 6వేల 900 కోట్ల రూపాయల విలువైన బొగ్గును ఈ రెండు సంస్థల నుంచి ఏపీ కొనుగోలు చేస్తుంది.
అదానీ కంపెనీ నుంచి బొగ్గు కొనుగోళ్లపై దేశవ్యాప్తంగా కొద్దిరోజులుగా పెద్దెత్తున చర్చ నడుస్తోంది. ప్రతి రాష్ట్రం తాను వినియోగించే బొగ్గులో 10 శాతం బొగ్గును విదేశాల నుంచి తప్పనిసరిగా దిగుమతి చేయాల్సిందేనని ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఒక నిబంధన విధించింది. ఈ నిబంధనపైనే పలు అనుమానాలు వ్యక్తమవయ్యాయి.
విదేశాల్లో బొగ్గు గనులను అదానీ సంస్థ దక్కించుకుంది. అదానీకి మంచిచేసేందుకు, విదేశాల్లోని అదానీ బొగ్గుకు డిమాండ్ పెంచేందుకే కేంద్రం ఇలా తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వాలు 10 శాతం బొగ్గును విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాలన్న నిబంధన తెచ్చిందన్న ఆరోపణ ఉంది. పైగా ధరను నియంత్రించే బాధ్యత నుంచి కూడా కేంద్రం తప్పుకుంది.
ఈ నేపథ్యంలోనే అదానీ సంస్థతో ఏపీ ప్రభుత్వం బొగ్గు సరఫరా ఒప్పందాలు చేసుకుంది. రూ. 100 కోట్లకు మించి టెండర్ ఉంటే… దాన్ని న్యాయసమీక్షకు పంపిస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం… తాజా అదానీ బొగ్గు ఒప్పందాన్ని మాత్రం సాంకేతిక కారణాలను చూపి న్యాయసమీక్షకు పంపలేదు.