టీడీపీ అంటే తొడలు దేహం పార్టీ.. సాయిరెడ్డి సెటైర్

మహానాడులో చంద్రబాబు దగ్గరుండి మరీ తొడలు కొట్టిస్తున్నారని, బూతులు తిట్టిస్తున్నారని మండిపడ్డారు ఎంపీ విజయసాయిరెడ్డి. టీడీపీ అంటే తొడలు-దేహం-పార్టీ అని కొత్త నిర్వచనం చెప్పారు. తాగుబోతు అయ్యన్నపాత్రుడు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారని విమర్శించారు. సీబీఎన్ కి కూడా కొత్త నిర్వచనం ఇచ్చారు సాయిరెడ్డి. సీబీఎన్ అంటే చంద్రబాబు నాయుడు కాదని, చంద్ర బూతుల నాయుడు అని అన్నారు ఇలా బూతులు తిట్టడమేనా చంద్రబాబు నైజం అని ప్రశ్నించారు. మిగతావారు తిడుతుంటే చంద్రబాబు శునకానందం పొందుతున్నారని మండిపడ్డారు. సొంత […]

Advertisement
Update:2022-05-30 09:06 IST

మహానాడులో చంద్రబాబు దగ్గరుండి మరీ తొడలు కొట్టిస్తున్నారని, బూతులు తిట్టిస్తున్నారని మండిపడ్డారు ఎంపీ విజయసాయిరెడ్డి. టీడీపీ అంటే తొడలు-దేహం-పార్టీ అని కొత్త నిర్వచనం చెప్పారు. తాగుబోతు అయ్యన్నపాత్రుడు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారని విమర్శించారు. సీబీఎన్ కి కూడా కొత్త నిర్వచనం ఇచ్చారు సాయిరెడ్డి. సీబీఎన్ అంటే చంద్రబాబు నాయుడు కాదని, చంద్ర బూతుల నాయుడు అని అన్నారు ఇలా బూతులు తిట్టడమేనా చంద్రబాబు నైజం అని ప్రశ్నించారు. మిగతావారు తిడుతుంటే చంద్రబాబు శునకానందం పొందుతున్నారని మండిపడ్డారు.

సొంత పుత్రుడికంటే దత్తపుత్రుడిపైనే నమ్మకం..
చంద్రబాబు ఎంత ఏడ్చినా అతనిపై సింపతీ రాదని, చంద్రబాబు తన సొంత కొడుకుని నమ్మడంలేదని, కేవలం దత్తపుత్రుడునే నమ్ముకుంటున్నారని అన్నారు విజయసాయిరెడ్డి. చంద్రబాబు తనకుతాను అపరచాణక్యుడు అనుకుంటున్నారని, కానీ ఆయన్ని జనం చీదరించుకుంటున్నారనే విషయం తెలుసుకోలేకపోతున్నారని చెప్పారు. చంద్రబాబు అధికారంలో ఉంటే ఆయన మనుషులు తప్ప ఇంకెవరూ బాగుపడరని అన్నారు. జగన్ పాలనలో అన్ని వర్గాలకూ న్యాయం జరుగుతుందని చెప్పారు.

బాబు హయాంలో ఒక్క పథకం అయినా ఉందా..?
2019లో వైసీపీ నేతలు, కార్యకర్తలు కలసి ఎలా పనిచేశారో.. 2024లో కూడా అంతకుమించి పని చేసి మళ్ళీ జగన్ ని సీఎం చేసుకోవాలని పిలుపునిచ్చారు విజయసాయిరెడ్డి. తమది మాట తప్పని ప్రభుత్వం అని, 70 శాతం పదవుల్ని బడుగు బలహీన వర్గాలకు అందించి సామాజిక న్యాయం పాటిస్తున్న పార్టీ తమదని గుర్తు చేశారు. పరిపాలన సౌలభ్యం కోసం సంస్కరణలు చేసిన ప్రభుత్వం తమదని చెప్పారు. ఇప్పటి వరకూ 1.42 లక్షల కోట్ల రూపాయలు నేరుగా లబ్ధిదారులకు అందించామని చెప్పారు. మహిళా సాధికారతను చేతల్లో చూపించామని, విద్యారంగంలో, వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చామని అన్నారు. చంద్రబాబు తెచ్చిన పథకం ఒక్కటి కూడా ఇప్పుడు చెప్పుకోడానికి లేదని ఎద్దేవా చేశారు.

Tags:    
Advertisement

Similar News