కేంద్రం తప్పుడు విధానాలతోనే విద్యుత్ కష్టాలు.. తేల్చేసిన ఇంజినీర్ల సంఘం..
దేశవ్యాప్తంగా బొగ్గు నిల్వల కొరతతో థర్మల్ పవర్ స్టేషన్లు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాయి. కరెంటు ఉత్పత్తి లేక రాష్ట్రాలు ప్రజల ముందు దోషులుగా నిలబడుతున్నాయి. అయితే వీటన్నిటికీ కారణం కేంద్ర ప్రభుత్వ తప్పుడు నిర్ణయాలే అంటున్నారు విద్యుత్ ఇంజినీర్లు. ఆలిండియా పవర్ ఇంజినీర్స్ ఫెడరేషన్ (AIPEF) సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేశాయి. కేవలం కేంద్రం తీసుకున్న నిర్ణయాల వల్లే విద్యుత్ సమస్యలు వచ్చాయని ఇంజినీర్స్ ఫెడరేషన్ సభ్యులు అభిప్రాయపడ్డారు. బొగ్గు సంక్షోభాన్ని నివారించేందుకు కోల్ ఇండియా […]
దేశవ్యాప్తంగా బొగ్గు నిల్వల కొరతతో థర్మల్ పవర్ స్టేషన్లు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాయి. కరెంటు ఉత్పత్తి లేక రాష్ట్రాలు ప్రజల ముందు దోషులుగా నిలబడుతున్నాయి. అయితే వీటన్నిటికీ కారణం కేంద్ర ప్రభుత్వ తప్పుడు నిర్ణయాలే అంటున్నారు విద్యుత్ ఇంజినీర్లు. ఆలిండియా పవర్ ఇంజినీర్స్ ఫెడరేషన్ (AIPEF) సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేశాయి. కేవలం కేంద్రం తీసుకున్న నిర్ణయాల వల్లే విద్యుత్ సమస్యలు వచ్చాయని ఇంజినీర్స్ ఫెడరేషన్ సభ్యులు అభిప్రాయపడ్డారు.
బొగ్గు సంక్షోభాన్ని నివారించేందుకు కోల్ ఇండియా సరైన సమయంలో సరిగా స్పందించలేకపోయిందని అంటున్నారు AIPEF సభ్యులు. బొగ్గు దిగుమతులతో ప్రైవేటు కంపెనీలకు లాభం చేకూర్చేలా కేంద్రం నిర్ణయం తీసుకుందని అన్నారు. బొగ్గు ధరల తేడా వల్ల అదానీ ఎంటర్ ప్రైజెస్ 30శాతం లాభాన్ని ఆర్జించిందని, దీనికి కారణం కేంద్రం నిర్ణయాలేనని చెప్పారు. విద్యుత్ సవరణ బిల్లు -2021ని వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు. మొత్తం 10 తీర్మానాలను వారు తమ సమావేశంలో ఆమోదించారు.
భారత్ లో విద్యుత్ సంక్షోభం, బొగ్గు నిల్వల కొరతపై ఇంజినీర్ల సంఘం స్వతంత్ర విచారణకు డిమాండ్ చేసింది. బొగ్గు దిగుమతులపై రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం విధించిన షరతులను కూడా ఉపసంహరించుకోవాలని కోరారు ప్రతినిధులు. పీపీఏలకు అనుగుణంగా స్మార్ట్ మీటర్లు అమర్చే ప్రక్రియ కూడా మంచిది కాదని తేల్చారు. దీనికోసం భారీ పెట్టుబడి అవసరం అవుతుందని, ఆ భారమంతా వినియోగదారులపై పడుతుందని చెప్పారు.
మొత్తమ్మీద ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న విద్యుత్ సంక్షోభానికి, బొగ్గు నిల్వల కొరతకు కేంద్రమే ప్రధాన కారణం అని తేల్చారు విద్యుత్ ఇంజినీర్లు.