తమిళాన్ని అధికార భాష చేయాలి " ప్రధాని ముందే స్టాలిన్ డిమాండ్

భారతదేశంలో హిందీ భాష విషయంపై వివాదం చెలరేగుతున్న నేపథ్యంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ గురువారం ప్రధాని మోదీతో కలిసి చెన్నై లో ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, మద్రాస్ హైకోర్టులో తమిళాన్ని అధికార భాషగా చేయాలని ప్రధాని నరేంద్ర మోడీని కోరారు. “హైకోర్టులో తమిళాన్ని అధికారిక భాష గా ప్రకటించాలని నేను ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేస్తున్నాను” అని చెన్నై చేరుకున్న ప్రధానికి స్వాగతం పలుకుతూ చేసిన ప్రసంగంలో స్టాలిన్ అన్నారు. […]

Advertisement
Update:2022-05-27 01:41 IST

భారతదేశంలో హిందీ భాష విషయంపై వివాదం చెలరేగుతున్న నేపథ్యంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ గురువారం ప్రధాని మోదీతో కలిసి చెన్నై లో ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, మద్రాస్ హైకోర్టులో తమిళాన్ని అధికార భాషగా చేయాలని ప్రధాని నరేంద్ర మోడీని కోరారు.

“హైకోర్టులో తమిళాన్ని అధికారిక భాష గా ప్రకటించాలని నేను ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేస్తున్నాను” అని చెన్నై చేరుకున్న ప్రధానికి స్వాగతం పలుకుతూ చేసిన ప్రసంగంలో స్టాలిన్ అన్నారు. జాతీయ వైద్య ప్రవేశ పరీక్ష నీట్ నుండి తమిళనాడును మినహాయించాలని కూడా స్టాలిన్ కోరారు. ఈ మేరకు తాము అసెంబ్లీలో తీర్మానం చేశామని చెప్పారు.

“తమిళ భాష శాశ్వతమైనది, తమిళ సంస్కృతి ప్రపంచవ్యాప్తం. తమిళ భాష, సంస్కృతిని మరింత ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి భారత ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉంది” అని ఈ సందర్భంగా ప్రధాని మోదీ అన్నారు.

రాష్ట్రానికి నిధులను పెంచాలని కూడా స్టాలిన్ ప్రధానిని కోరాడు. తమిళనాడు అభివృద్ధి కేవలం ఆర్థిక పరిమితులపై మాత్రమే కాకుండా ‘ద్రావిడ మోడల్’పై ఆధారపడి ఉన్నదని చెప్పారు. రాష్ట్రాల‌తో కేంద్ర క‌లిసి ప‌నిచేస్తేనే దేశాభివృద్ధి సాధ్య‌మ‌ని కూడా ఆయన అన్నారు. త‌మిళ‌నాడుకు కేంద్రం ఇవ్వాల్సిన జీఎస్టీ నిధుల‌ను విడుద‌ల చేయాల‌ని కూడా స‌భా వేదిక‌గానే మోదీని స్టాలిన్ కోరారు.

కాగా సీఎం స్టాలిన్‌తో కలిసి ప్రధాని మోదీ పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. 31,000 కోట్ల రూపాయలతో 11 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు.

ALSO READ: ముఖ్యమంత్రి అవుదామనుకుంటే గుమాస్తా అయ్యాడు

Tags:    
Advertisement

Similar News