మూడు నెలల్లో సంచలన వార్త.. కేసీఆర్ ప్రకటనపై సర్వత్రా ఆసక్తి
జాతీయ స్థాయిలో కొత్త కూటమికోసం ఏర్పాట్లు చేస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్, ఇప్పటి వరకూ చాలామంది నాయకులను కలిశారు, పొత్తులపై చర్చలు జరిపారు. కానీ తొలిసారిగా ఆయన ఓ కీలక ప్రకటన చేశారు. బెంగళూరు పర్యటనలో మాజీ ప్రధాని దేవెగౌడ, మాజీ సీఎం కుమారస్వామిని కలసిన కేసీఆర్.. మూడు నెలల్లోగా ఓ సంచలన వార్త దేశ ప్రజలు వింటారని చెప్పారు. అయితే ఆ వార్త ఏంటనే విషయంలో ఆయన చిన్న క్లూ కూడా ఇవ్వలేదు. అటు కుమారస్వామి […]
జాతీయ స్థాయిలో కొత్త కూటమికోసం ఏర్పాట్లు చేస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్, ఇప్పటి వరకూ చాలామంది నాయకులను కలిశారు, పొత్తులపై చర్చలు జరిపారు. కానీ తొలిసారిగా ఆయన ఓ కీలక ప్రకటన చేశారు. బెంగళూరు పర్యటనలో మాజీ ప్రధాని దేవెగౌడ, మాజీ సీఎం కుమారస్వామిని కలసిన కేసీఆర్.. మూడు నెలల్లోగా ఓ సంచలన వార్త దేశ ప్రజలు వింటారని చెప్పారు. అయితే ఆ వార్త ఏంటనే విషయంలో ఆయన చిన్న క్లూ కూడా ఇవ్వలేదు. అటు కుమారస్వామి కూడా దసరా సందర్భంగా దేశ ప్రజలకు ఓ శుభవార్త చెబుతామని అన్నారు. ఇంతకీ ఆ శుభవార్త, సంచలన వార్త ఏంటనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ప్రాంతీయ పార్టీలతో కూటమి ఏర్పడినా ప్రధాని పదవి దగ్గరకొచ్చే సరికి ఎక్కడా శృతి కుదరదనే విషయం ఇప్పటిపే చాలాసార్లు రుజువైంది. కానీ ఈసారి అలా కాకూడదని, కూటమి ఆ విషయం దగ్గరే ఆగిపోకూడదని కేసీఆర్ ప్రణాళిక రచిస్తున్నట్టు తెలుస్తోంది. దేశంలో ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందన్నది ముఖ్యం కాదని, ఎవరు ప్రధాని అయ్యారన్నదీ కీలకం కాదని చెబుతున్న కేసీఆర్.. ప్రస్తుత పాలనకు చరమగీతం పాడటమే తమ తక్షణ కర్తవ్యమని చెప్పారు. ప్రస్తుతం దేశ ప్రజలకు ఉజ్వల భారత్ అవసరం ఎంతైనా ఉందని చెప్పారు.
ఉజ్వల హిందుస్థాన్ కోసం ఎంతకైనా శ్రమిస్తామన్నారు కేసీఆర్. ప్రకృతి సంపద, మానవ వనరులు, అత్యుత్తమ భౌగోళిక పరిస్థితులున్న భారత్ ను అమెరికాను మించిన ఆర్థిక వ్యవస్థగా మార్చవచ్చని, కానీ ఇప్పటికీ ఆ దిశగా ఎవరూ కృషి చేయలేదని చెప్పారు. 75 ఏళ్ల స్వతంత్ర భారతంలో ప్రజలు ఇంకా తాగునీరు, విద్యుత్ కోసం ఇబ్బంది పడటం విచారకరం అన్నారు కేసీఆర్.
3గంటలపాటు సుదీర్ఘ చర్చలు..
దేవెగౌడ, కుమారస్వామితో తెలంగాణ సీఎం కేసీఆర్ సుదీర్ఘంగా 3 గంటలసేపు చర్చలు కొనసాగించారు. దేశ రాజకీయ, ఆర్థిక స్థితిగతులపై చర్చలు జరిగాయి. అందరి సహకారంతో దేశంలో మార్పు సాధిస్తామని అన్నారు కేసీఆర్. ఈ చర్చలు దేశానికి సమగ్ర పాలన అందించే దిశగా సాగాయని చెప్పారు కర్నాటక మాజీ సీఎం కుమారస్వామి. భవిష్యత్ లో దేశ ప్రజలకు శుభవార్త చెబుతామన్నారు.
ALSO READ: నేటి నుండి టీడీపీ మహానాడు… పొత్తులపై చర్చ