వైసీపీ ప్రజాప్రతినిధులకు భద్రత పెంపు
మంగళవారం మధ్నాహ్నం మూడు గంటల నుంచి దాదాపు ఆరు గంటల పాటు అల్లర్లతో అట్టుడికిన అమలాపురంలో రాత్రి 9 గంటల తర్వాత పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఏలూరు రేంజ్ డీఐజీ పాలరాజు ఆధ్వర్యంలో రాజమండ్రి, కాకినాడ, కృష్ణా జిల్లా నుంచి దాదాపు వెయ్యి మంది పోలీసులు అమలాపురం చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఆందోళనకారులు ఏకంగా మంత్రి, ఎమ్మెల్యే ఇంటిని దగ్ధం చేయడంతో ఇతర ప్రజాప్రతినిధులకు భద్రతకు కట్టుదిట్టం చేశారు. జిల్లాలోని పలువులు వైసీపీ ప్రజాప్రతినిధులు,ఎమ్మెల్యేలు సురక్షిత […]
మంగళవారం మధ్నాహ్నం మూడు గంటల నుంచి దాదాపు ఆరు గంటల పాటు అల్లర్లతో అట్టుడికిన అమలాపురంలో రాత్రి 9 గంటల తర్వాత పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఏలూరు రేంజ్ డీఐజీ పాలరాజు ఆధ్వర్యంలో రాజమండ్రి, కాకినాడ, కృష్ణా జిల్లా నుంచి దాదాపు వెయ్యి మంది పోలీసులు అమలాపురం చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
ఆందోళనకారులు ఏకంగా మంత్రి, ఎమ్మెల్యే ఇంటిని దగ్ధం చేయడంతో ఇతర ప్రజాప్రతినిధులకు భద్రతకు కట్టుదిట్టం చేశారు. జిల్లాలోని పలువులు వైసీపీ ప్రజాప్రతినిధులు,ఎమ్మెల్యేలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లారు. గోదావరి జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులు కాకినాడ, రాజమండ్రిలోని హోటళ్లకు కుటుంబసభ్యులతో తరలి వెళ్లారు. ఉభయగోదావరి జిల్లాల వైసీపీ ప్రజాప్రతినిధులకు భద్రతను పెంచారు. పోలీసులకు సమాచారం ఇవ్వకుండా నేతలు పర్యటనకు వెళ్లవద్దని పోలీసులు స్పష్టం చేశారు.
బుధవారం నుంచే ఎస్సీ, ఎస్టీ, బీసీ మంత్రుల బస్సు యాత్ర మొదలవుతున్న నేపథ్యంలో.. యాత్రకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేస్తున్నారు. స్పెషల్ పార్టీ పోలీసులతో బస్సు యాత్రకు రక్షణ కల్పించబోతున్నారు. కోనసీమ అల్లర్ల నేపథ్యంలో అమలాపురానికి ఆర్టీసీ బస్సు సర్వీసులను నిలిపివేశారు. దాడుల్లో పాల్గొన్న వారిలో అత్యధికులు పాతికేళ్ల లోపు యువకులే కావడం పోలీసులను ఆందోళనకు గురి చేస్తోంది. ఎక్కువగా యువత బయటకు రావడంతో వారిని అదుపు చేయడం పోలీసులకు ఆరు గంటల పాటు సవాల్‌గా మారింది.
దావోసులో ఉన్న ముఖ్యమంత్రికి ఇక్కడి పరిస్థితిని ఎప్పటికప్పుడు ప్రభుత్వ వర్గాలు వివరించాయి. ఈ విధ్వంసానికి ఇంటెలిజెన్స్ వైఫల్యం కూడా ఉందని భావిస్తున్నారు. భారీగా పోలీసులను ముందే మోహరించినా.. ఆందోళనకారులు ఒక్కసారిగా మెరుపుదాడికి దిగే అవకాశాన్ని, వారు ఎంచుకున్న మార్గాలను పసిగట్టడంలో ఇంటెలిజెన్స్ వైఫల్యం ఉందన్న విమర్శలు వస్తున్నాయి.
తొలుత కోనసీమకు అంబేద్కర్ పేరు పెట్టాలన్న డిమాండ్ వచ్చినా స్పందించని ప్రభుత్వం .. ఇటీవలే పునరాలోచన చేసి అంబేద్కర్ పేరును జిల్లా పేరులో చేర్చింది. ఇప్పుడు వెనక్కు వెళ్లలేని పరిస్థితి. అలాని బలవంతంగా జిల్లాకు పేరు కొనసాగిస్తే ప్రజల్లో ఆవేశం అలాగే ఉండిపోతుందన్న అభిప్రాయం ఉంది.
ALSO READ: జిన్నా టవర్ వర్సెస్ అంబేద్కర్ జిల్లా